శ్రీతేజ్‌ని అల్లు అర్జున్‌ ఎందుకు పరామర్శించలేదంటే.. అల్లు అరవింద్‌ వివరణ

First Published | Dec 18, 2024, 10:24 PM IST

సంధ్య థియేటర్‌ ఘటనలో గాయపడిన శ్రీతేజ్‌ని నిర్మాత అల్లు అరవింద్‌ పరామర్శించారు. అల్లు అర్జున్‌ ఎందుకు ఆసుపత్రికి వెళ్లలేదు అనేదానిపై ఆయన వివరణ ఇచ్చాడు.
 

`పుష్ప 2` సినిమా ప్రీమియర్స్ రోజు సంధ్య థియేటర్‌ ఘటనలో మహిళ రేవతి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె కొడుకు శ్రీతేజ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను ఇంకా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత, అల్లు అర్జున్‌ ఫాదర్‌ అల్లు అరవింద్‌ పరామర్శించారు. బుధవారం ఆయన కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లని అడిగి తెలుసుకున్నారు. 

read more: చిరంజీవి-ఓదెల మూవీ నుంచి క్రేజీ అప్‌ డేట్‌, మెగా ఫ్యాన్స్ కి ఆ విషయంలో డిజప్పాయింట్‌ తప్పదా?

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీతేజ్‌ కోలుకుంటున్నాడని తెలిపారు. అయితే పూర్తి స్థాయిలో కోలుకోవడానికి ఇంకా చాలా రోజులు పడుతుందని వైద్యులు తెలిపినట్టు వెల్లడించారు. ఆసుపత్రిలో చేరినప్పట్నుంచి పోల్చితే ఆరోగ్యం మెరుగుపడుతుందని,

గత పది రోజులుగా బెటర్మెంట్‌ కనిపిస్తుందని వైద్యులు చెప్పినట్టు వెల్లడించారు. శ్రీతేజ్‌ మళ్లీ మామూలు మనిషిలా మారడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని అరవింద్‌ చెప్పారు. శ్రీతేజ్‌కి ఏదైనా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.  


Pushpa 2 allu arjun

అదే సమయంలో శ్రీతేజ్‌ కోలుకోవడానికి సంబంధించి, అతన్ని సంపూర్ణ ఆరోగ్యంగా చూడ్డానికి ప్రభుత్వం కూడా ముందుకు రావడం ఆనందంగా ఉందని తెలిపారు అరవింద్‌. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ ఇప్పటి వరకు శ్రీతేజ్‌ని పరామర్శించకపోవడానికి గల కారణాలు వెల్లడించారు అల్లు అరవింద్‌. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే అల్లు అర్జున్‌ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్‌ని చూడాలనుకున్నాడు. కానీ ఆసుపత్రి అధికారులు నిన్ననే ఘటన జరిగింది. మరో సంఘటన వద్దు, రావద్దని చెప్పారు. 

also read: అజ్ఞానంతో చేస్తున్నారు.. అల్లు అర్జున్‌పై వివాదాస్పద కామెంట్లకు రాజేంద్రప్రసాద్‌ వివరణ ఇదే

కరెక్ట్ గా అదే రోజు కేసు పడింది. దీంతో లీగల్‌ టీమ్‌ నిరంజన్‌ రెడ్డి కూడా ఎట్టిపరిస్థితుల్లోనూ అల్లు అర్జున్‌ ఆసుపత్రికి వెళ్లకూడదు అని. పేరెంట్స్ ని కలవకూడదు అని కూడా వెల్లడించారు. ఆ తర్వాత రావడానికి చాలా నిబంధనలు ఉన్నాయి. నేను అబ్బాయిని పరామర్శించడానికి ప్రభుత్వాన్ని అనుమతి కోరాను.

ఒక రోజు బన్నీ నేను చూడలేకపోతున్నా డాడీ, మీరు అయినా వెళ్లి చూసి రండి అని చెప్పాడు, అందుకే ప్రభుత్వం అనుమతి అడిగాం. ఈ పర్మిషన్‌ ఇచ్చిన సీఎం రేవంత్‌ రెడ్డి, పోలీసు అధికారులకు, ఆసుపత్రి నిర్వహకులకు ధన్యవాదాలు` అని తెలిపారు నిర్మాత అల్లు అరవింద్. 
 

అల్లు అర్జున్‌ హీరోగా నటించిన `పుష్ప 2` సినిమా డిసెంబర్‌ 4న ప్రీమియర్స్ ప్రదర్శించిన విషయం తెలిసిందే. అభిమానుల మధ్య సినిమా చూసేందుకు అల్లు అర్జున్‌ సంధ్య థియేటర్ కి వెళ్లగా, భారీగా అభిమానులు తరలి వచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో అభిమాని రేవతి మరణించగా, ఆమె కొడుకు శ్రీతేజ్‌ గాయపడ్డాడు.

అతనికి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనలో సంధ్య థియేటర్ యాజమాన్యంపై, అల్లు అర్జున్‌పై రేవతి భర్త కేసు నమోదు చేశాడు. అందులో భాగంగా బన్నీని కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించగా, హైకోర్ట్ మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. 

read more: నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో మోక్షజ్ఞ మూవీ.. బాలయ్య వారసుడి ఎంట్రీలో మరో ట్విస్ట్ ? తెరపైకి మరో దర్శకుడి పేరు
 

Latest Videos

click me!