అవమానంతో కన్నీళ్లు పెట్టుకున్న అల్లు రామలింగయ్య, చిరంజీవి ఉన్నా ఆ పని చేయడానికి నో చెప్పిన అల్లు అరవింద్

First Published | Jan 1, 2025, 9:30 AM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య నటుడిగా అల్లు రామలింగయ్య చెరగని ముద్ర వేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకు చాలా మంది స్టార్ హీరోల చిత్రాల్లో అల్లు రామలింగయ్య నటించారు. టాలీవుడ్ లో దిగ్గజ నటుల్లో ఆయన ఒకరు.

Allu Aravind

తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య నటుడిగా అల్లు రామలింగయ్య చెరగని ముద్ర వేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకు చాలా మంది స్టార్ హీరోల చిత్రాల్లో అల్లు రామలింగయ్య నటించారు. టాలీవుడ్ లో దిగ్గజ నటుల్లో ఆయన ఒకరు. అలాంటి అల్లు రామలింగయ్యకే కొన్నిసార్లు అవమానాలు తప్పలేదట. తన తండ్రికి జరిగిన అవమానాన్ని అల్లు అరవింద్ ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. 

Megastar Chiranjeevi

తాను చిన్న తనంలో ఉన్నప్పుడు నాన్న ఒకసారి భోజనం చేస్తూ బాధపడ్డారు. ఆ రోజు షూటింగ్ లో జరిగిన సంఘటనని అమ్మతో చెప్పారు. ఒక సన్నివేశం కోసం 10 టేకులు వరకు తీసుకున్నాను. ఎంత ప్రయత్నించినా డైరెక్టర్ కోరుకున్నట్లు రావడం లేదు. నా ప్రయత్న లోపం లేదు. కానీ ఎందుకో ఆ షాట్ ఒకే కావడం లేదు. డైరెక్ట్ర్ కోపంతో తన చేతిలో ఉన్న వస్తువుని విసిరి కొడుతూ.. ఎందుకు వస్తారయ్యా మీలాంటి వాళ్లంతా ఛీ ఛీ అని ఇష్టం వచ్చినట్లు తిట్టారట. 

Also Read : టాలీవుడ్ హీరోలతో ప్రేమలో పడకపోవడానికి కారణం ఉంది.. పెళ్లి గురించి నటి మీనా ఆసక్తికర వ్యాఖ్యలు


Megastar Chiranjeevi

ఆ సంఘటన చెబుతూ నాన్నగారు కంటతడి పెట్టుకున్నారు. కడుపుబ్బా నవ్వించే హాస్య నటులకు కూడా ఇలాంటి అనుమానాలు తప్పవు. నా మనసులో అది బాగా పాతుకుపోయింది అని అల్లు అరవింద్ తెలిపారు. అందుకే నటన వైపు వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నా. కానీ కొన్నేళ్ల తర్వాత జంధ్యాల గారు చిరంజీవితో చేసిన చంటబ్బాయి చిత్రంలో ఒక వేషం వేయమని బలవంతం చేశారు. 

Allu Ramalingaiah

చిరంజీవి గారు కూడా నీ దగ్గర ట్యాలెంట్ ఉంది.. ఈ పాత్ర నువ్వే చేయాలి అని ఫోర్స్ చేశారు. దీనితో సరే అని ఒప్పుకుని అందులో నటించా. అనుకోకుండా సూపర్ హిట్ అయింది. అందరూ నా యాక్టింగ్ ని మెచ్చుకున్నారు. ఈ సినిమా తర్వాత నాకు, నాన్నకి ఒక సంభాషణ జరిగింది. నీకు నటుడిగా మంచి పేరు వస్తోంది. ఇకపై యాక్టింగ్ కొనసాగించు అని చెప్పారు. నువ్వు నిర్మాత అయితే డబ్బు రావచ్చు పోవచ్చు.. రిస్క్ ఉంటుంది. 

అదే నటుడువి అయ్యావనుకో డబ్బు వస్తూనే ఉంటుంది కానీ నీకు పోయేది ఏమీ ఉండదు అని చెప్పారు. నాకు నటనపై ఇంట్రెస్ట్ లేదు. వెంటనే చెబితే నాన్న ఫీల్ అవుతారని ఒకరోజు టైం అడిగాను. ఒక రోజు తర్వాత ఏరా ఏం ఆలోచించావు అని అడిగారు. నేను ఎంప్లాయర్ అవుదాం అనుకున్నాను కానీ ఎంప్లాయి అవుదామని అనుకోలేదు అంటూ అల్లు అరవింద్ సమాధానం చెప్పారు. అంటే ఒకరి కింద పనిచేయడం తనకి ఇష్టం లేదని పరోక్షంగా చెప్పేశారట. నిర్మాతని అయితే నేను ఎవరి కిందా పనిచేయాల్సిన అవసరం లేదు. నటుడిని అయితే నిర్మాత కింద, డైరెక్టర్ కింద నేను పనిచేయాలి. 

నాన్నగారికి జరిగిన అవమానాలు ఎదురవుతాయి. అది నాకు ఇష్టం లేదు అని అల్లు అరవింద్ తన నిర్ణయం చెప్పేశారట. ఒక వైపు తను తండ్రి, మరోవైపు చిరంజీవి గొప్ప నటులుగా రాణిస్తున్నా అల్లు అరవింద్ మాత్రం నటించడానికి ఇష్టపడలేదు. ఆ తర్వాత రోజుల్లో అల్లు అరవింద్ టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు. 

Latest Videos

click me!