Meena
హీరోయిన్లు హీరోల ప్రేమలో పడడం పెళ్లి వరకు వెళ్లడం ఇప్పుడే కాదు అపట్లోనూ జరిగేవి. స్టార్ హీరోలు చాలా మంది హీరోయిన్లని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. 90వ దశకంలో తెలుగు చిత్ర పరిశ్రమలో వెలుగు వెలిగిన హీరోయిన్లలో నటి మీనా ఒకరు. మీనా తెలుగులో వెంకటేష్, నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్ లాంటి హీరోలతో నటించింది. ఆమె ఎక్కువగా స్క్రీన్ షేర్ చేసుకుంది మాత్రం వెంకటేష్ తోనే.
చంటి, సుందరకాండ, సూర్యవంశం, అబ్బాయిగారు, దృశ్యం , దృశ్యం 2 ఇలా వీళ్ళిద్దరూ అనేక చిత్రాల్లో నటించారు. మీనా 2009లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. విద్యాసాగర్ అనే వ్యక్తితో మీనా వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె సంతానం. 2022లో విద్యాసాగర్ అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే.
మీనా ఓ ఇంటర్వ్యూలో ప్రేమ పెళ్లి విషయాల గురించి మాట్లాడారు. చిత్ర పరిశ్రమలో చాలా ప్రేమ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. కలసి నటించిన హీరోలు హీరోయిన్లు ప్రేమలో పడుతున్నారు. మీరు ఏ హీరోని ప్రేమించలేదా అని యాంకర్ మీనాని ప్రశ్నించారు. దీనికి మీనా సమాధానం ఇచ్చింది. చాలా చిన్న ఏజ్ లో నేను హీరోయిన్ అయిపోయాను. చంటి మూవీ చేసే సమయానికి నా వయసు 15 ఏళ్ళు. చిన్న ఏజ్ లోనే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి హీరోలతో ఎక్కువగా సినిమాలు చేశాను.