రాంచరణ్, సూర్య చిత్రాలతో కాసుల పంట..చిరు మూవీని అలా చేసి ఘోరంగా దెబ్బ తిన్న అల్లు అరవింద్

Published : Apr 07, 2024, 12:48 PM IST

అల్లు అరవింద్ అన్ని విషయాల్లో చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉంటారు. సినిమాల నిర్మాణం విషయంలో ఆయన ప్లానింగ్ అద్భుతంగా ఉంటుంది. అందుకే అల్లు అరవింద్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు. 

PREV
16
రాంచరణ్, సూర్య చిత్రాలతో కాసుల పంట..చిరు మూవీని అలా చేసి ఘోరంగా దెబ్బ తిన్న అల్లు అరవింద్
Allu Aravind

అల్లు అరవింద్ అన్ని విషయాల్లో చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉంటారు. సినిమాల నిర్మాణం విషయంలో ఆయన ప్లానింగ్ అద్భుతంగా ఉంటుంది. అందుకే అల్లు అరవింద్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు. సినిమాల నిర్మాణం విషయంలో తాను చేసిన రిస్క్ ని, పొందిన విజయాల్ని, ఎదురు దెబ్బలని ఓ ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ ప్రస్తావించారు. 

26

మీ కెరీర్ లో రిస్క్ చేసిన చిత్రం ఏదని అడగగా అల్లు అరవింద్ మగధీర అని సమాధానం ఇచ్చారు. మగధీర చిత్రానికి అనుకున్న బడ్జెట్ కంటే 80 శాతం ఎక్కువైంది. దీనితో కాస్త టెన్షన్ పడ్డా. సిజి వర్క్ కంప్లీట్ అయ్యాక రాజమౌళి గారు నాకు సినిమా చూపించారు. 

36

వెంటనే బయటకి వచ్చి డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి ఫోన్ చేశా. ఏ ఏ ఏరియాలకు కమిటయ్యారు అని అడిగా. రెండు మూడు ఏరియాలు చెప్పారు. ఇక ఏ ఏరియాకి కమిటవ్వద్దు. మొత్తం మనమే రిలీజ్ చేస్తున్నాం అని చెప్పా. రిస్క్ లో ఉన్నానని తెలుసు. అయినా ఆ నిర్ణయం తీసుకున్నా. మగధీర చిత్రానికి ఎంత డబ్బు రిస్క్ చేశానో అంతకి మూడింతలు వచ్చింది అని అల్లు అరవింద్ అన్నారు. 

46

అదే విధంగా అల్లు అరవింద్ రిస్క్ చేసిన మరో చిత్రం గజినీ. అమీర్ ఖాన్ హీరోగా హిందీలో అల్లు అరవింద్ గజినీ చిత్రాన్ని నిర్మించారు. ఆ మూవీ కాసుల వర్షం కురిపించింది. ఇలా అల్లు అరవింద్ రిస్క్ చేసి భారీ బడ్జెట్ లో నిర్మించిన చిత్రాలు చాలా ఉన్నాయి. 

56

గజినీ కంటే చాలా ఏళ్ళ ముందే అల్లు అరవింద్ ఓ చిత్రాన్ని హిందీలో నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన చూడాలని ఉంది చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఆ చిత్రాన్ని అశ్విని దత్, అల్లు అరవింద్ కలసి హిందీలో రీమేక్ చేశారు. 

66

అనిల్ కపూర్, రాణి ముఖర్జీ, మనీషా కొయిరాలా ఇలా స్టార్ నటీనటులతో చూడాలని ఉంది చిత్రాన్ని కలకత్తా మెయిల్ పేరుతో రీమేక్ చేశారు. ఆ మూవీ హిందీలో డిజాస్టర్ గా నిలిచింది. దీని గురించి అల్లు అరవింద్ మాట్లాడుతూ ఆ చిత్రంతో నాకు 16 పళ్ళు, అశ్విని దత్ గారికి 16 కలిపి మొత్తం 32 పళ్ళు ఊడిపోయాయి అని ఫన్నీగా అన్నారు. ఆ చిత్రంతో భారీ నష్టం వచ్చినట్లు తెలిపారు. 
 

click me!

Recommended Stories