సునీల్ టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఉదయ్ కిరణ్, తరుణ్, వెంకటేష్ , నాగార్జున లాంటి హీరోల చిత్రాల్లో సునీల్ పండించిన కామెడీ హైలైట్ అయ్యేది. సొంతం, నువ్వే నువ్వే, మనసంతా నువ్వే, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు లాంటి చిత్రాల్లో సునీల్ కామెడీ పొట్ట చెక్కలయ్యేలా ఉంటుంది.