ప్రేమించి పెళ్లి చేసుకుంటే, ఇప్పుడు ఛీ కొడుతుంది... భార్యపై  పంచ్ ప్రసాద్ సంచలన కామెంట్స్ 

Published : Apr 07, 2024, 11:48 AM IST

జబర్దస్త్ కమెడియన్స్ లో ఒకరైన పంచ్ ప్రసాద్ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయితే చికిత్స అనంతరం కోలుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పంచ్ ప్రసాద్ కీలక కామెంట్స్ చేశాడు.   

PREV
15
ప్రేమించి పెళ్లి చేసుకుంటే, ఇప్పుడు ఛీ కొడుతుంది... భార్యపై  పంచ్ ప్రసాద్ సంచలన కామెంట్స్ 

పంచ్ ప్రసాద్ జబర్దస్త్ వేదికగా ఫేమస్ అయ్యాడు. అలాగే  శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా చాలా కాలం సందడి చేశాడు. పంచ్ ప్రసాద్ కి కిడ్నీ సమస్య ఉంది. ఏళ్లుగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధికి చికిత్స తీసుకుంటున్నాడు. 

25

ఏపీ ప్రభుత్వం చొరవ చూపడంతో పంచ్ ప్రసాద్ కి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. అప్పటి నుండి కోలుకున్నాడు. విశ్రాంతి అవసరం నేపథ్యంలో పంచ్ ప్రసాద్ ఈ మధ్య టెలివిజన్ షోలలో కనిపించడం లేదు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు అతడు దూరం అయ్యాడు. 

 

35

పంచ్ ప్రసాద్ కోలుకోవడంలో భార్య పాత్ర ఎంతగానో ఉంది. ఆమె పంచ్ ప్రసాద్ ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఒక దశలో పంచ్ ప్రసాద్ నడవలేని స్థితికి చేరుకున్నారు. తోటి కమెడియన్స్ ఆర్థికంగా అతన్ని ఆదుకున్నారు. భార్య సునీత తన కిడ్నీ దానం చేస్తానని చెప్పిందట. అయితే డోనర్ దొరకడంతో భార్య కిడ్నీ అవసరం లేదని చెప్పారట. 

45

కాగా తన భార్య గురించి లేటెస్ట్ ఇంటర్వ్యూలో పంచ్ ప్రసాదక్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న సునీత ఇప్పుడు నన్ను ఛీ అంటుందని నిర్మొహమాటంగా చెప్పాడు. 

 

55

పంచ్ ప్రసాద్ మాట్లాడుతూ... నా కామెడీ పంచులు నచ్చి అభిమానిని అని సునీత నన్ను వివాహం చేసుకుంది. కానీ ఇప్పుడు నా పంచులు నచ్చడం లేదట. ఛీ అంటుంది. చికిత్స తర్వాత నేను కోలుకున్నాను. కానీ నా భార్య సునీత అనారోగ్యం బారిన పడింది... అన్నారు. పంచ్ ప్రసాద్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

Read more Photos on
click me!

Recommended Stories