జబర్దస్త్ (jabardasth) షోలో సుడిగాలి సుధీర్ టీమ్ కి మంచి పేరుంది. సుధీర్, రామ్ ప్రసాద్, గెటప్ శ్రీనుతో కూడిన ఈ టీమ్ నాన్ స్టాప్ కామెడీ పంచుతున్నారు. దీనితో ఈ త్రయం చాలా ఫేమస్ అయ్యారు. ఇక మల్టీ టాలెంటెడ్ అయిన సుధీర్... మరింతగా ఫేమ్ రాబట్టి బుల్లితెర స్టార్ గా ఎదిగాడు. ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ, పోవే పోరా వంటి షోలలో యాంకర్ గా కూడా చేస్తున్నారు.