Bigg Boss Telugu 7: బిగ్ బాస్ 7 కి ముహూర్తం ఫిక్స్?  దిమ్మతిరిగే డిటైల్స్!

Published : May 13, 2023, 04:16 PM IST

బిగ్ బాస్ తెలుగు 7కి రంగం సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఓ క్రేజీ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. 

PREV
15
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ 7 కి ముహూర్తం ఫిక్స్?  దిమ్మతిరిగే డిటైల్స్!
Bigg Boss Telugu 7


బిగ్ బాస్ షో అంటే పడిచచ్చే ప్రేక్షకులు ఎందరో ఉన్నారు. సెలబ్రిటీల జీవితాలను దగ్గరగా చూపించే ఈ రియాలిటీ షోకి జనాల్లో పిచ్చ క్రేజ్ ఉంది. అందుకే బిగ్ బాస్ తెలుగు టాప్ రేటెడ్ షోగా ఉంది. 2017లో బిగ్ బాస్ తెలుగు మొదలైంది. ఇప్పటివరకు ఆరు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఫస్ట్ సీజన్ కి ఎన్టీఆర్, సెకండ్ సీజన్ కి నాని హోస్ట్స్ గా చేశారు. 
 

25
Bigg Boss Telugu 6


గత నాలుగు సీజన్స్ గా నాగార్జున హోస్టింగ్ బాధ్యతలు నెరవేరుస్తున్నారు. అయితే సీజన్ 6 తీవ్ర విమర్శల పాలైంది. నాగార్జున హోస్టింగ్ కూడా తేలిపోయింది. నాగార్జున ఇక తప్పుకుంటే బెటర్ అని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో షో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కనీస టీఆర్పీ రాబట్టలేకపోయింది. రొటీన్ గేమ్స్, రూల్స్, కంటెస్టెంట్స్ ప్రేక్షకులకు కిక్ ఇవ్వలేకపోయాయి. 
 

35
Bigg Boss Telugu 6

ఈ క్రమంలో సీజన్ 7 పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారట. నయా రూల్స్, గేమ్స్ తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచాలని ఫిక్స్ అయ్యారట. ఇక జూన్ నుండి కంటెస్టెంట్స్ ఎంపిక మొదలు కానుందట. కనీస పాపులారిటీ ఉన్న సెలెబ్రిటీలను హౌస్లోకి పంపాలనే ఆలోచనలో ఉన్నారట. అందుకే దొరికిన వాళ్ళను కాకుండా ఎంచుకున్న వాళ్ళను పంపాలని ప్రయత్నాలు చేస్తున్నారట. 
 

45
Bigg Boss Telugu

జులై కల్లా కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి సెప్టెంబర్ మొదటి వారం లేదా రెండో వారం షో ప్రారంభిస్తారట. మేకర్స్ ఈ మేరకు గట్టి ప్రణాళికలు వేస్తున్నారట. ఇక హోస్ట్ విషయంలో కూడా నిర్ణయం తీసుకుంటారట. రానాతో పాటు పలువురి పేర్లు పరిశీలిస్తున్నారట. టాప్ స్టార్స్ ఎవరూ ముందుకు రాని పక్షంలో నాగార్జునే హోస్ట్ చేసే అవకాశం కలదంటున్నారు. 

55


ఇక గత సీజన్లో సింగర్ రేవంత్ విన్నర్ గా అవతరించారు. నిజానికి శ్రీహాన్ విన్నర్ కావాల్సింది. అతడు నాగార్జున ఆఫర్ చేసిన డబ్బులకు టెంప్ట్ కావడంతో టైటిల్ కోల్పోయాడు. ప్రేక్షకుల ఓట్ల ప్రకారం విన్నర్ శ్రీహాన్. ఇక శివ బాలాజీ, కౌశల్, రాహుల్ సిప్లిగంజ్, అభిజీత్, వీ జే సన్నీ గత సీజన్స్ విన్నర్స్ గా ఉన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories