సమంతలా అలాంటి సాంగ్స్  చేయను, నానితో మనస్ఫూర్తిగా నటించలేకపోయాను... కృతి శెట్టి కీలక కామెంట్స్!

Published : May 13, 2023, 03:12 PM IST

సమంత పుష్ప మూవీలో చేసిన ఐటెం నెంబర్ ఓ సెన్సేషన్. ఇలాంటి సాంగ్ చేసే అవకాశం వస్తే చేస్తావా అని కృతి శెట్టిని అడగ్గా ఆమె ఆసక్తికర సమాధానం చెప్పారు.   

PREV
16
సమంతలా అలాంటి సాంగ్స్  చేయను, నానితో మనస్ఫూర్తిగా నటించలేకపోయాను... కృతి శెట్టి కీలక కామెంట్స్!
Samantha

2021లో విడుదలైన పుష్ప పాన్ ఇండియా విజయం సాధించింది. ఈ చిత్రం అల్లు అర్జున్ కి ఎక్కడలేని ఇమేజ్ తెచ్చిపెట్టింది. సినిమా అంతా ఒకెత్తు కాగా సమంత చేసిన ఐటెం సాంగ్ మరొక ఎత్తు. కెరీర్లో మొదటిసారి ఐటెం సాంగ్ చేసిన సమంత దుమ్మురేపింది. షార్ట్ ఫ్రాక్ లో ఆమె వేసిన బోల్డ్ స్టెప్స్ ప్రేక్షకులను గిలిగింతలు పెట్టాయి. 
 

26
samantha


సమంతకు కొత్త ఇమేజ్ తెచ్చిపెట్టిన సాంగ్ అది. ఇలాంటి సాంగ్ కృతి శెట్టి చేయదట. కస్టడీ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న కృతి శెట్టికి ఈ ప్రశ్న ఎదురైంది. ఆమె ఆసక్తికర సమాధానం చెప్పారు. పుష్ప మూవీ సమంత చేసిన 'ఊ అంటావా మామా' వంటి సాంగ్ చేసే అవకాశం వస్తే చేస్తారా? అని అడగ్గా చేయను అన్నారు. 

36
Shyam Singha Roy

ప్రస్తుతానికి నాకు అలాంటి సాంగ్స్ చేసే ఆలోచన లేదు. ఎందుకంటే ఆ సాంగ్స్ పట్ల నాకు అవగాహన లేదు. ఎప్పుడూ ఆలోచించలేదు కూడాను. ఇన్నేళ్ల కెరీర్లో నాకు తెలిసిన విషయం ఏమిటంటే సౌకర్యంగా లేనప్పుడు చేయకపోవడం మంచిది. శ్యామ్ సింగరాయ్ మూవీలో కొన్ని సన్నివేశాలు మనస్ఫూర్తిగా చేయలేకపోయాను. మనసుకు ఇబ్బంది కలిగించే సన్నివేశాలు, పాటలు చేయకపోతేనే మంచిది అన్నారు. 

46


అయితే సమంత ఫైర్. ఆ సాంగ్ కి అద్భుతంగా డాన్స్ చేశారని కృతి శెట్టి కొనియాడారు. శ్యామ్ సింగరాయ్ మూవీలో కృతి శెట్టి బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించారు. నాని-కృతి మధ్య కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నాయి. ఈ సన్నివేశాల్లో కూడా ఇబ్బందిగానే నటించానని కృతి శెట్టి ఓపెన్ అయ్యారు. కృతి డెబ్యూ మూవీ ఉప్పెనలో సైతం ఆమె శృంగార సన్నివేశాల్లో నటించారు. 
 

56


ఇక కృతి కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. ఆమెకు వరుస ప్లాప్స్ పడుతున్నాయి. లేటెస్ట్ మూవీ కస్టడీ సైతం నిరాశపరిచింది. కస్టడీ ఆమెకు నాలుగో ప్లాప్. గత ఏడాది కృతి నటించిన ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ప్లాప్ అయ్యాయి. 

66


ప్రస్తుతం కృతి శెట్టి ఓ తమిళ్, మలయాళ చిత్రంలో నటిస్తున్నారు. మరో కన్నడ బ్యూటీ శ్రీలీల నుండి కృతికి భారీ పోటీ ఎదురవుతుంది. ఆమె టాలీవుడ్ లో దున్నేస్తుంది. 

click me!

Recommended Stories