మళ్ళీ జంటగా కనిపించబోతున్న సమంత, నాగ చైతన్య.. ఫ్యాన్స్ కి రొమాంటిక్ ఫీస్ట్ గ్యారెంటీ

Published : Jun 16, 2025, 12:53 PM IST

సమంత, నాగ చైతన్య చాలా ఏళ్ళ తర్వాత జంటగా కనిపించబోతున్న వార్త ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

PREV
15
ఏ మాయ చేసావే రీ రిలీజ్

సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకుని నాలుగేళ్లు అవుతోంది. కానీ వీరిద్దరినీ మరోసారి జంటగా చూసే అవకాశం అభిమానులకు దక్కబోతోంది. తెలుగు సినీ ప్రేమికుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన చిత్రం 'ఏ మాయ చేసావే' రీ రిలీజ్ కి రెడీ అవుతోంది. జూలై 18న ఈ చిత్రం మళ్లీ థియేటర్లలో విడుదల కానుంది. రియల్ లైఫ్ లో కాకుండా ఇలా సిల్వర్ స్క్రీన్ పై మరోసారి సమంత, నాగ చైతన్యని జంటగా చూసే అవకాశం అభిమానులకు కలగబోతోంది. 

25
చైతు, సమంత రొమాంటిక్ పెర్ఫార్మెన్స్ 

2010లో విడుదలైన ఈ చిత్రం ద్వారా సమంత, నాగచైతన్యలు తొలిసారి కలుసుకున్నారు. అప్పట్లో ఇద్దరూ సినీ పరిశ్రమలో కొత్తవారే. ఈ చిత్రంలో సమంత, నాగ చైతన్య రొమాంటిక్ అండ్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలిచింది. ఈ సినిమా విజయంతో వీరి కెరీర్ మొదటి మెట్టెక్కగా, ప్రొఫెషనల్ రిలేషన్‌షిప్ ఒక్కటే కాకుండా, వ్యక్తిగతంగా కూడా ప్రేమలో పడ్డారు.కోనేళ్ళ పాటు ప్రేమించుకున్న వీరిద్దరూ  2017లో గోవాలో వివాహం చేసుకున్నారు. తమ ప్రేమను గుర్తుగా నిలిపేందుకు సమంత త‌న మెడపై ‘ఏ మాయ చేసావే’ టాటూ కూడా వేయించుకున్నారు. సమంతకి ఏ మాయ చేసావే చిత్రం అంత స్పెషల్ అని చెప్పొచ్చు. కానీ ఇటీవల సమంత ఆ టాటూని చెరిపివేసింది. 

35
విడాకులు 

అయితే, 2021లో వీరిద్దరూ విడాకులు ప్రకటించగా, అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. విడాకుల తర్వాత సమంత, నాగ చైతన్య ఎవరి వర్క్ తో వాళ్ళు బిజీ అయిపోయారు. నాగచైతన్య గతేడాది డిసెంబర్‌లో నటి శోభిత ధూళిపాళను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సమంత మరోవైపు, దర్శకుడు రాజ్ నిడిమోరుతో రిలేషన్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి బలం చేకూరుస్తూ సమంత అతడితో సన్నిహితంగా కనిపిస్తోంది. 

45
మళ్ళీ జంటగా చైతు, సమంత 

ఇప్పుడు, 'ఏ మాయ చేసావే' రీ రిలీజ్ అవుతుండడంతో అభిమానులకు వీరిద్దరూ మళ్లీ తెరపై కనిపించబోతున్నారు. కార్తీక్ పాత్రలో చైతు, జెస్సీ పాత్రలో సమంత ఒదిగిపోయి నటించారు. ఏ ఆర్ రెహమాన్ అందించిన సంగీతం యువతని బాగా ఆకట్టుకుంది. మంజుల ఘట్టమనేని ఈ చిత్రాన్ని నిర్మించారు. 

55
ఇద్దరి రియాక్షన్ ఏంటో..

చైతు, సమంత ఇద్దరికీ తమ కెరీర్ లో ఏ మాయ చేసావే ప్రత్యేకమైన చిత్రం. అలాంటి చిత్రం 15 ఏళ్ళ తర్వాత రీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సమంత, నాగ చైతన్య రియాక్షన్ ఎలా ఉండబోతోంది అనే ఉత్కంఠ ఫ్యాన్స్ లో నెలకొంది.

Read more Photos on
click me!

Recommended Stories