కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026లో అలియా భట్ తన స్టైల్‌తో అదరగొట్టింది. అచ్చం కథల్లోని రాకుమారిలా మింట్-గ్రీన్ కలర్ గౌనులో కనిపించింది. ఈ డ్రెస్‌తో ఆమె 'ప్రిన్సెస్-కోర్' అనే కొత్త ట్రెండ్‌ను పరిచయం చేసింది. ఆమె గ్రేస్‌ఫుల్ లుక్ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇది ఆమె బెస్ట్ ఇంటర్నేషనల్ రెడ్ కార్పెట్ లుక్స్‌లో ఒకటని అభిమానులు అంటున్నారు. ఈ మిడి బాల్ గౌనుకు సన్నని షోల్డర్ స్ట్రాప్స్, డీప్ నెక్లైన్, పెద్ద వాల్యూమ్‌తో ఉన్న స్కర్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఫ్రెంచ్ రివేరాలో ఈ మింట్ కలర్ డ్రెస్ అలియాకు చాలా ఫ్రెష్, ఎలిగెంట్ లుక్‌ను ఇచ్చింది.