రాంచరణ్ తో స్టన్నింగ్ లుక్ లో స్టార్ డైరెక్టర్ కూతురు, ఒక్క సినిమా ప్లీజ్ అంటున్న ఫ్యాన్స్..వైరల్ ఫోటోస్

First Published | Dec 28, 2024, 1:35 PM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. జనవరి 10న రిలీజ్ చేస్తున్నట్లు ఆల్రెడీ ప్రకటించారు. అమెరికాలోని డల్లాస్ నగరంలో గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. జనవరి 10న రిలీజ్ చేస్తున్నట్లు ఆల్రెడీ ప్రకటించారు. అమెరికాలోని డల్లాస్ నగరంలో గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. త్వరలో ఇండియాలో పలు నగరాల్లో ప్రమోషన్స్ కి చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాంచరణ్ నటించిన చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. 

డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్. డల్లాస్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గేమ్ చేంజర్ చిత్ర యూనిట్ తో పాటు మరో బ్యూటీ కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆ యంగ్ బ్యూటీ ఎవరో కాదు.. డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి శంకర్. అదితి శంకర్ కూడా తండ్రితో కలసి గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొంది. 


మోడ్రన్ గా ఉన్న బ్లాక్ లెదర్ డ్రెస్ లో అదితి శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మెరిసింది. ఈ డ్రెస్ లో ఆమె గ్లామర్ లుక్స్ ఆకర్షించే విధంగా ఉన్నాయి. రాంచరణ్ తో కలసి కొన్ని ఫోజులు ఇచ్చింది. ఆ దృశ్యాలని అదితి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ది గేమ్ ఛేంజర్.. రాంచరణ్ సర్ తో ఇలా అంటూ ఆ ఫోటోలకు అదితి క్యాప్షన్ ఇచ్చింది. నెటిజన్లని ఈ దృశ్యాలు తెగ ఆకర్షిస్తున్నాయి. రాంచరణ్ బ్లాక్ జాకెట్ ధరించి సూపర్ స్టైలిష్ గా ఉన్నాడు. 


Also Read : రాజమౌళి మూవీలో ప్రియాంక చోప్రా.. మహేష్ బాబుని భయపెడుతున్న సెంటిమెంట్, షాకిచ్చిన హీరోయిన్ల లిస్ట్ ఇదే

రాంచరణ్, అదితి జంట అదిరిపోయింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రాంచరణ్, అదితి కలసి ఒక చిత్రంలో నటించాలని అప్పుడే ఫ్యాన్స్ రిక్వస్ట్ లు మొదలు పెట్టేశారు. ఆల్రెడీ అదితి శంకర్ నటిగా రాణిస్తోంది. అదితి శంకర్ తెలుగులో కూడా నటిగా ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఆమె భైరవం అనే చిత్రంలో నటిస్తోంది. 

మరి అదితి శంకర్, రాంచరణ్ జంటని సిల్వర్ స్క్రీన్ పై చూడాలనే అభిమానుల కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి. డల్లాస్ ఈవెంట్ తర్వాత దిల్ రాజు ఏపీలో గేమ్ ఛేంజర్ కోసం భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. 

Latest Videos

click me!