నాగార్జున, బాలయ్య, విశ్వక్ సేన్ ఇప్పుడు మనోజ్ వెండితెరపై హీరోలు, బుల్లితెరపై హోస్ట్ లు, సత్తా చాటిన స్టార్స్

First Published | Dec 13, 2023, 8:56 AM IST

గతంలో బుల్లితెరకు వెండితెరకు కాస్త దూరం కనిపించేది. బుల్లితెరపై కష్టపడి వెండితెర వరకూ ఎదిగినవారు చాలామంది ఉన్నారు. అయితే వెండితెరపై రారాజులుగా వెలిగిన తారలు..బుల్లితెరపై కనిపిస్తారని ఎవరూ ఊహించలేదు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలు చాలా మంది.. టెలివిజన్ రంగంలో సంచలనం సృష్టిస్తున్నారు. హోస్ట్ లు గా మారి..పెద్ద పెద్ద కార్యక్రమాలను సక్సెస్ ఫుల్  చేస్తున్నారు. 

కింగ్ నాగార్జున, బాలయ్య, విశ్వక్ సేన్, ఇప్పుడు మంచు మనోజ్.. వీళ్లే కాదు.. టాలీవుడ్ లో హోస్ట్ లు గా సక్సెస్ అయిన హీరోలు ఇంకా ఉన్నారు. బుల్లితెరపై తమ వాక్ ఛాతుర్యాన్ని పండించి.. పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ను సక్సెస్ వైపు నడిపించారు. అటు బాలీవుడ్ లో అమితాబ్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్స్ ను ఆదర్శంగా తీసుకుని..మనవాళ్లు కూడా టెలివిజన్ లో రెచ్చిపోయారు. ఇంతకీ హోస్ట్ లు గా చేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరు..? 

Manchu Manoj

ప్రస్తుతం మంచు మనోజ్ హోస్ట్ అవతారం ఎత్తాడు. గతంలో మన తెలుగు హీరోలు హోస్ట్ లుగా సక్సెస్ అవ్వడంతో.. మనోజు కూడా ఇటు వైపు అడుగులు వేశాడు. ఉస్తాద్.. ర్యాంప్ ఆడిద్దాం అంటూ గేమ్ షోతో వచ్చేస్తున్నారు మంచు మనోజ్. ఈటీవీకి సబంధించిన  ఓటిటిలో డిసెంబర్ 15 నుంచి.. ఈ షో అది రానుంది. తాజాగా టీజర్ కూడా రిలీజ్ అయ్యి ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది. హీరోగా అవకాశాలు లేకపోవడంతో.. ఇలా బుల్లితెరపై కొత్త ప్రయాణం స్టార్ట్ చేశాడు మనోజ్. 


మనోజ్ మాత్రమే కాదు.. మంచి ఫామ్ లో ఉన్న యంగ్ హీరోలు కూడా ఇలా హోస్ట్ లుగా మారిపోతున్నారు. ఈ క్రమంలనే వరుస సినిమాలతో బిజీగా ఉన్నా..హోస్ట్ అవతారం ఎత్తాడు యంగ్ హీరో..మాస్ కా దాస్  విశ్వక్ సేన్. ఈ మధ్యే ఆహాలో ఫ్యామిలీ ధమాకాతో బాగానే ఆకట్టుకుంటున్నారు. వరస సినిమాలతో పాటు గేమ్ షోకు డేట్స్ ఇచ్చారు మాస్ కా దాస్.

ఇక ప్రస్తుతం బిగ్ బాస్ షోను సక్సెస్ ఫుల్ గా హోస్ట్ చేస్తున్నాడు కింగ్ నాగార్జున. సక్సెస్ ఫుల్ గా 5 సీజన్లను నాగ్ హోస్ట్ చేశాడు. ఇప్పటి వరకూ తెలుగు బిగ్ బాస్ 7 సీజన్లు సందడిచేయగా.. ప్రస్తుతం ఏడో సీజన్ ముగింపుదశలో ఉంది. ఇక నాగార్జున తెలుగు బిగ్ బాస్ కు బ్రాండ్ గా మారిపోయారు. 

అంతకు ముందు మీలో ఎవరు కోటీశ్వరులు కార్యక్రమాన్నికూడా నాగార్జున సక్సెస్ ఫుల్ గా నడిపించారు. హిందీలో అమితాబ్ బచ్చన్ కొన్నేళ్లుగా విజయవంతంగా నడిపిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రామ్ ను తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరులు టైటిల్ తో తీసుకువచ్చారు. ఈ ప్రోగ్రామ్ కు హెస్ట్ గా అదరగొట్టారు నాగ్. 

ఇక అందరికంటే తానేమి తక్కువ కాదు అని నిరూపించాడు నందమూరి నట సింహం బాలకృష్ణ.  ఆహా ఓటీటీ యాప్ కోసం ఆయన హోస్ట్ గా మారి.. అన్ స్టాపబుల్ అనే కార్యక్రమంతో రచ్చ చేశాడు. బాలయ్య హోస్ట్ గా ఎలా ఉంటాడా అని సందేహంతో ఉన్నవారికి తనయాంకరింగ్ తో అదరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. అంతే కాదు రెండు సీజన్లను సక్సెస్ ఫుల్ చేసిన బాలకృష్ణ.. ప్రస్తుతం మూడో సీజన్ ను స్టార్ట్ చేశారు. అన్ స్టాపబుల్ కు వచ్చినంత మంది సెలబ్రిటీలు.. ఇంకే ప్రోగ్రామ్ కు వచ్చి ఉండరు.

ఇక ఇప్పుడు చెప్పుకున్నవారు.. ప్రస్తుతం హోస్ట్ లు గా కంటీన్యూ అవుతుంటే.. గతంలో మరికొంత మంది స్టార్లు హోస్టింగ్ చేసి.. డ్రాప్ అయ్యారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్  మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ ను తెలుగులో లాంచ్ చేసినప్పుడు మొదటి హోస్ట్ గా చేశారు. అంతే కాదు.. తెలుగు లో బిగ్ బాస్ సీజన్ 1ను తారకే లీడ్ చేశాడు. మొదటి సీజన్ నే ఎక్కడికో తీసుకెళ్ళాడు. భారీ రేటింగ్ తీసుకువచ్చాడు. ఆతరువాత మరోసారి ఎవరు మీలో కోటీశ్వరుడు అంటూ.. కాస్త టైటిల్ మార్చి యాంకర్ గా ట్రై చేశాడు. ఇప్పుడు మాత్రం గ్లోబల్ స్టార్ ఇమేజ్ తో .. తన సినిమాలపై దృష్టి పెట్టాడు. 

ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా హోస్ట్ గా మారారు.కింగ్ నాగార్జున నడిపించిన ఎవరు మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ సెకండ్ సీజన్ ను మెగాస్టార్ హోస్ట్ గా చేశారు. కాని ఆ సీజన్ అనుకున్నంత రిజల్ట్ ను రాబట్ట లేకపోయింది. ఆతరువాత ఆయన అటు వైపు చూడలేదు. 

ఇక నేచురల్ స్టార్ నాని కూడా హోస్ట్ అవతార ఎత్తారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 1ను ఎన్టీఆర్ నడిపిస్తే.. సీజన్ 2 నాని హోస్ట్ గా చేశారు. కాని ఈ సీజన్ వల్ల నాని చాలా విమర్షలు ఫేస్ చేశారు. కంటెస్టెంట్స్ ను హ్యాండిల్ చేయడం రాలేదని...నెట్టింట్లో ట్రోల్స్ కు గురయ్యారు. దాంతో నాని ఆ ఒక్క సీజన్ కే పరిమితం అయ్యారు. తరువాతి సీజన్ కూడాచేయాలి అని అడిగినా. నో చెప్పేశారట. 

ఇక టాలీవుడ్ లో హోస్ట్ గా రాణించినవారిలో దగ్గుబాటి హీరో రానా కూడా ఉన్నారు. నెంబర్ వన్ యారీ తో స్టార్ట్ అయ్యి. ఆయన రెండు మూడు కార్యక్రమాలను విజయవంతంగా నడిపించారు. స్టార్ హీరోలను ఇంటర్వ్యూ లు చేయడమే కాదు.. వారితో ఫన్నీ కాన్వర్జేష్.. యంగ్ స్టార్స్ సీక్రేట్స్ తో ఆడుకోవడం.. వాళ్లను ఇరకాటంలో పెట్టి ఫన్ క్రియేట్ చేయడం ఇలా రానా ప్రోగ్రామ్ కు మంచి రేటింగ్ ఉండేది. ఇలా టాలీవుడ్ నుంచి ఎందరో స్టార్లు హోస్ట్  లుగా రాణించారు. ముందు ముందు కూడా చాలా మందిర రాబోతున్నట్టు తెలుస్తోంది. 

Latest Videos

click me!