సీజన్ 7లో కూడా ఆరుగురు ఫైనల్ వీక్ లోకి ఎంటర్ అయ్యారు. అయితే గ్రాండ్ ఫినాలేలో ఉండేది ఐదుగురే. ఒకరు మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. శోభ ఎలిమినేటైన తర్వాత నాగార్జున... శివాజీ, అమర్, ప్రశాంత్, యావర్, అర్జున్, ప్రియాంకలను ఫైనలిస్ట్స్ గా ప్రకటించారు. కాబట్టి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండదు అనేది మరో వాదన.