10 ప్లాప్ లు అయినా తగ్గని స్టార్ హీరో.. సినిమాకు 100 కోట్లు పైనే వసూలు చేస్తున్న నటుడు ఎవరు...?

First Published | Jul 17, 2024, 10:52 AM IST

అతనో స్టార్ హీరో.. వరుస హిట్లతో ఇండస్ట్రీని ఏలిన హీరో.. 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకునే ఈ స్టార్.. ఇప్పుడు వరుస ప్లాప్ లతో ఇబ్బందిపడుతున్నాడు. అయినా సరే రేటు మాత్రం ఏమాత్రం తగ్గించడం లేదట.  
 

ఈమధ్య ఫిల్మ్ ఇండస్ట్రీలో రెమ్యునరేషన్ గొడవలు పెరిగిపోయాయి. స్టార్ హీరోల రెమ్యునరేషన్స్ పై నెగెటీవ్ వాయిస్ పెరుగుతోంది. సినిమా ప్లాప్ అయినా.. హిట్ అయినా.. నిర్మాతలకు లాభం వచ్చినా..నష్టం వచ్చినా.. హీరోలు మాత్రం కోట్లల్లో రెమ్యూనరేషన్ తీసుకోవడం విమర్శలకు దారి తీస్తోంది. కొంత మంది అయితే వందల కోట్లు వసూలు చేస్తున్నారు. 

జూనియర్ ఎన్టీఆర్ ప్రభంజనం తట్టుకుని నిలబడ్డ వెంకటేష్ సినిమా ఏదో తెలుసా..?

రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా.. హీరోల రెమ్యునరేషన్‌లు మాత్రం అంతనంత ఎత్తులో ఉంటోంది. 30 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే హీరోల సినిమాలు ఫస్ట్ రోజు 3 కోట్లు కూడా వసూలు చేయడం లేదు అంటూ.. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ బహిరంగంగానే విమర్శించారు. హీరోలు కాస్త ఆలోచించుకోవలసిన అవసరం ఉందంటూ అభిప్రయంకూడా వ్యక్తం చేశారు. 

జమున మీద పగబట్టిన ఎన్టీఆర్ ‌- ఏఎన్నార్, ఆమె మీద కోపంతో ఏం చేశారంటే..?


Akshay

కాగా తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ పరిస్థితికి ఉదాహరణంగా మారారు. దాదాపు 9 ప్లాప్ లు వరుసగా వచ్చినా కాని ఆయన తన రెమ్యూనరేషన్ తగ్గిచుకోలేదంటూ విమర్షలు వస్తున్నాయి. పైగా కొంతమంది హీరోలు ఒక సక్సెస్ రాగానే రెమ్యూనరేషన్ డబుల్  చేస్తున్నారు. అదే హీరో వరుసగా రెండు మూడు ప్లాప్స్ వచ్చినా సరే.. పారితోషికం తగ్గిచుకోవడం లేదు. 
 

రాజమౌళి ఆఫర్.. నో చెప్పిన సూర్య.. గోల్డెన్ ఛాన్స్ ను తమిళ హీరో ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా..?

అక్షయ్ కుమార్ తన లాస్ట్ సినిమాకు ఏకంగా 165 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడని టాక్. ఒకప్పుడు ఆయనకు యమా క్రేజ్ ఉంది. వరుసగా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆయన రేటు 100 కోట్లు దాటినప్పటి నుంచి ఎక్కువగా ప్లాప్ లే చూస్తున్నాడు. దాంతో నిర్మాతలకు ఇది భారంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

గతంలో అక్షయ్ కుమార్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే.. థియేటర్ల దగ్గర రచ్చ రచ్చ జరిగేది. ముగ్గురు  ఖాన్‌లతో సహా బాలీవుడ్ ను ఏలుతున్న కపూర్‌ల సినిమాలు ఓ రేంజ్ లో రిలీజ్ అవుతున్న టైమ్ లో కూడా.. వారి వేవ్ ను తట్టుకుని.. పోటీ ఇస్తూ..  ఇండస్ట్రీలో నిలబడ్డాడు అక్షయ్. ప్రయోగాత్మక సినిమాలకు ఆయన కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచేవాడు.
 

ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అసలు బాలీవుడ్ పరిస్థితే బాలేదు.. ఇప్పుడు అంతా సౌత్ డామినేషన్.. అందులోను టాలీవుడ్ హీరోలు విజయ విహారం చేస్తున్నారు. దాంతో బాలీవుడ్ లో సినిమాలు పెద్దగా ఆడటం లేదు. అక్షయ్ కుమార్  కూడా హిట్ కోసం ఎన్నో పనాట్లు పడాల్సి వస్తోంది. అయినా సక్సెస్ మాత్రం దక్కడం లేదు. అసలు అక్షయ్ కుమార్ సోలోగా, సాలిడ్ హిట్టు కొట్టి మూడేళ్లయింది. 
 

బచ్చన్ పాండే సినిమా నుంచి చూసుకుంటే.. ఇప్పటి వరకూ వరుసగా ప్లాప్ లు పడుతూనే ఉన్నాయి అక్షయ్ కుమార్ కు. కాస్త అంతో ఇంతో  ఓమైగాడ్ సినిమా మాత్రం అక్షయ్ పేరును నిలబెట్టింది అని చెప్పాలి. అయితే ఈసినిమా హిట్ అయినా.. నిర్మాతలకు మాత్రం లాభాలు రాలేదు అనేది బాలీవుడ్ టాక్. ఇక ఇంత జరుగుతున్న అక్షయ్ కుమార్ మాత్రం తన రెమ్యూనరేషన్ విషయంలో కొండెక్కి కూర్చున్నట్టు టాక్. 

అక్షయ్ కుమార్ చివరిగా చేసిన  బడే మియాన్ చోటే మియాన్ సినిమాకు 165 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. అక్షయ్ తన రెమ్యూనరేషన్ తగ్గించుకుంటున్నారు అని.. ఓ సినిమాకు ఆయన 30 కోట్లే తీసుకున్నారని మరో టాక్. ఇక ప్రస్తుతం అక్షయ్ టాలీవుడ్ సినిమా చేస్తున్నారు. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న భక్త కన్నప్ప మూవీలో శివుడి పాత్రలో ఆయన కనిపించబోతున్నాడు. దీనికోసం మాత్రం భారీగానే వసూలు చేశాడని అంటున్నారు. ఏది ఏమైనా.. అక్షయ్ హిట్ కొడితే చూడాలని ఉంది అంటున్నారు ఆయన ఫ్యాన్స్. 

Latest Videos

click me!