హీరోగా మోహన్ బాబు కెరీర్ కి అసెంబ్లీ రౌడీ గట్టి పునాది వేసింది. అప్పటికి ఒప్పుకున్న చిత్రాల వరకు విలన్ గా చేసిన మోహన్ బాబు అనంతరం హీరోగా కొనసాగాడు. అల్లరి మొగుడు, చిట్టెమ్మ మొగుడు, మేజర్ చంద్రకాంత్ వంటి హిట్ చిత్రాలతో మోహన్ బాబు హీరోగా సెటిల్ అయ్యాడు. 1995లో వచ్చిన పెదరాయుడు ఇండస్ట్రీ హిట్ కొట్టింది.