ఎంత పెద్ద స్టార్ అయినా.. టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. స్టార్ హీరో అయినంత మాత్రాన ఎప్పుడూ హిట్లు పడాలని లేదు.. వరుస ప్లాప్ సినిమాలు ఎంత పెద్ద స్టార్ హీరోని అయినా కిందకుపడేస్తాయి. ఒక్కోసారి లేవకుండా చేస్తాయి. కొంత మంది స్టార్లు మాత్రం తట్టుకుని నిలబడతారు.. వాళ్ల టైమ్ వచ్చేవరకూ వెయిట్ చేస్తారు. సాలిడ్ కమ్ బ్యాక్ ఇస్తుంటారు. అయితే తాజాగా ఓ స్టార్ హీరో 100 కోట్లు దాటి రెమ్యూనరేషన్ తీసుకునే హీరో.. ఇప్పుడు తన రేటు తగ్గించుకోక తప్పలేదట. ఇంతకీ ఎవరా హీరో..?
సినిమా ఫలితం ఎలా ఉన్నా.. హీరోల రెమ్యూనరేషన్ మాత్రం వందల కోట్లకు ఎగబాకుతున్న సంగతి తెలిసిందే..? చిన్న హీరోలు కూడా 30 కోట్లకు తక్కువ తీసుకోవడం లేదు. కాని వారి సినిమాలకు ఫస్ట్ రోజు కూడా మూడు కోట్లు రావడంలేదు అన్నారు రీసెంట్ గా స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్. ఇక బాలీవుడ్‌లోని టాప్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకడు. ఒకప్పుడు వరుస హిట్లతో సునామీ సృష్టించిన అక్షయ్.. ఇప్పుడు ఒక్క హిట్టు కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాడు.
Akshay
అసలు అక్షయ్ కుమార్ సోలోగా, సాలిడ్ హిట్టు కొట్టి మూడేళ్లయింది. అక్షయ్ కుమార్ పతనం బచ్చన్ పాండే సినిమాతో స్టార్ట్ అయింది. ఆ తర్వాత వరుసగా 9 డిజాస్టర్‌లు ఫేస్ చేశాడు. అక్షయ్ కుమార్ తన లాస్ట్ సినిమాకు ఏకంగా 165 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడని టాక్. ఒకప్పుడు ఆయనకు యమా క్రేజ్ ఉంది. వరుసగా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆయన రేటు 100 కోట్లు దాటినప్పటి నుంచి ఎక్కువగా ప్లాప్ లే చూస్తున్నాడు. దాంతో నిర్మాతలకు ఇది భారంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఇక తాజాగా అక్షయ్ కుమర్ తాన రెమ్యూనరేషన్ తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. అక్షయ్ కుమార్ తన చివరి సినిమా బడే మియాన్ చోటే మియాన్ సినిమాకు అక్షరాల 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇక సర్ఫిరా సినిమాకు ఆయన కేవలం 30 కోట్లు మాత్రమే తీసుకున్నాడట. అలా మూవీ బడ్జెట్‌ను, మేకింగ్‌ను బట్టి అక్షయ్ కుమార్ చార్జ్ చేస్తుంటాడట. 150 కోట్లు రెమ్యూనరేషన్ చూసిన ఈస్టార్ హీరో.. ఇప్పుడు ఇలా 30 కోట్లకే పరిమితం అవ్వడం అందరిని షాక్ కు గురిచేస్తోంది.
ఇక ప్రస్తుతం అక్షయ్ కుమర్ ఎక్కువగా ఇతర హీరోల సినిమాల్లో మెరుస్తున్నాడు. టాలీవుడ్ లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ మూవీ కన్నప్పలో మహాశివుడిగా కనిపించబోతున్నాడు అక్షయ్ కుమార్. మంచి విష్ణు హీరోగా.. మంచు ఫ్యామిలీ ప్రెస్టేజియస్ గా రూపొందిస్తున్న ఈమూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.