ఇందులో ఆయనది గెస్ట్ రోల్ అని తెలుస్తుంది. ఇక ఈ పోస్టర్ విడుదల సందర్భంగా టీమ్ చెబుతూ, కన్నప్పలో దైవత్వం, శక్తి, ప్రశాంతత కి ఆకర్షణీయమైన ఉనికికి కేరాఫ్ అయిన శివుడి పాత్రలో అక్షయ్‌ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందని, అచంచలమైన ప్రేమ, భక్తి, త్యాగానికి సంబంధించిన యుగయుగాలుగా ఉన్న కథలోకి ప్రవేశించండి అంటూ పేర్కొంది టీమ్.
ఈ ఏప్రిల్‌లో పెద్ద తెరపై ఈ భారీ సినిమాని వీక్షించండి అని వెల్లడించింది. `కన్నప్ప`లో శివుడి పాత్రలో నటించడం పట్ల అక్షయ్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. ఇది దైవత్వంతో కూడిన మూవీగా తెలిపారు.