ప్రముఖ అమెరికన్ సింగర్ అకాన్ బెంగళూరులో కన్సర్ట్ నిర్వహించారు. ఈ కన్సర్ట్ లో అకాన్ దారుణంగా అవమానానికి గురయ్యారు. ఆ సంఘటనకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రముఖ అమెరికన్ గాయకుడు అకాన్ ఇండియా టూర్ లో భాగంగా నవంబర్ 14 న బెంగళూరులో నిర్వహించిన కన్సర్ట్ లో పెర్ఫామ్ చేశాడు. ఈ ఈవెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా అకాన్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఈ ఈవెంట్ వైరల్ కాలేదు. అక్కడ జరిగిన సంఘటన కారణంగా వైరల్ అవుతోంది. ఈ ఈవెంట్ లో ప్రేక్షకులు ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కచేరీ సమయంలో ముందు వరుసలో ఉన్న కొంతమంది అభిమానులు అకాన్ ప్యాంట్ ను లాగిన ఘటన బయటకు రావడంతో సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి.
25
బెంగళూరులో అకాన్ కన్సర్ట్
అకాన్ ఇండియా టూర్ నవంబర్ 9 న ఢిల్లీలో ప్రారంభమైంది. అనంతరం బెంగళూరులో ప్రదర్శన ఇచ్చిన ఆయన నవంబర్ 16 న ముంబై కార్యక్రమంతో టూర్ ముగించనున్నారు. ఈ క్రమంలో బెంగళూరు ప్రదర్శన సమయంలో జరిగిన ఘటన ఇప్పుడు నగరంపై విమర్శలు రావడానికి కారణమైంది.
35
ప్యాంట్ లాగేస్తూ దారుణమైన బిహేవియర్
వైరల్ వీడియో ప్రకారం అకాన్ తన గాత్రంతో ఆకట్టుకుంటున్న సమయంలో స్టేజ్ ముందు భాగంలో ఉన్న బ్యారికేడ్ వద్దకు చేరుకుని ప్రేక్షకులతో దగ్గరగా సంభాషించడానికి ప్రయత్నించారు. అయితే ఈ సమయంలో కొంతమంది అభిమానులు ఆయన చేతిని పట్టుకోవడానికి ప్రయత్నించకుండా నేరుగా ప్యాంట్ ను లాగుతూ కనిపించారు. దీనితో అకాన్ తన ప్రదర్శన కొనసాగిస్తూ ప్యాంట్ ను పదేపదే సరిచేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గాయకుడు తన ప్రదర్శన ఆపకుండా కొనసాగించడం అభిమానులను ఆకట్టుకున్నప్పటికీ జరిగిన వ్యవహారం తీవ్ర నిరాశను కలిగించింది.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చిన వెంటనే సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ మొదలైంది. పలువురు యూజర్లు ఇది స్పష్టమైన వేధింపుల చర్య అని పేర్కొన్నారు. ఒక యూజర్ ఇది చాలా బాధాకరమని పేర్కొంటూ స్టేజ్ పై ప్రత్యక్షంగా ఆయనను వేధించినట్టే అని వ్యాఖ్యానించాడు. మరో యూజర్ అకాన్ దీన్ని చాలా కాలం గుర్తుంచుకుంటారని అభిప్రాయపడ్డాడు.
55
బెంగళూరు ప్రతిష్ట దిగజార్చేలా..
ప్రదర్శనలో జరిగిన ఈ ఘటన కచేరీ ఆనందాన్ని పూర్తిగా మసకబార్చిందని పలువురు పేర్కొన్నారు. అభిమానులు ప్రదర్శన మధ్యలో ఆయన ప్యాంట్ ను లాగడం వల్ల అకాన్ స్పష్టంగా అసౌకర్యంతో కనిపించారని చర్చించారు. ఈ ఈవెంట్ లో ప్రేక్షకులు సభా మర్యాద లేనట్టుగా ప్రవర్తించారని యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనతో అంతర్జాతీయ గాయకులను ఆహ్వానించే సందర్భాల్లో ప్రేక్షకుల ప్రవర్తన ఎంత ముఖ్యమో మళ్లీ చర్చకు వచ్చింది. అకాన్ తన ప్రదర్శన ఆపకుండా కొనసాగించినందుకు అభిమానులు మెచ్చుకుంటున్నప్పటికీ బెంగళూరులో జరిగిన ఈ వ్యవహారం నగర ప్రతిష్టపై ప్రశ్నలెత్తించిందని చాలామంది పేర్కొంటున్నారు.