బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతోంది. వైల్డ్ కార్డు ఎంట్రీలు వచ్చాక హౌస్ మొత్తం సందడిగా మారింది. ముక్కు అవినాష్, టేస్టీ తేజ, జబర్దస్త్ రోహిణి లాంటి వాళ్ళు బాగా నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు. అదే విధంగా నామినేషన్స్ సమయంలో రచ్చ ఎక్కువ అవుతోంది. 45 వ రోజుకి సంబంధించిన ప్రోమో విడుదలయింది.