OG2: ఓజీ 2 కథ ఇదే, సుజీత్‌కి డేట్స్ ఇచ్చేసిన పవన్‌.. ఈ సారి ఎంత ఊహించుకున్నా తక్కువే

Published : Jun 25, 2026, 01:03 PM IST

పవన్‌ కళ్యాణ్‌ నటించిన `ఓజీ` మూవీ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు దీనికి పార్ట్ 2 రాబోతుంది. తాజాగా పవన్‌ కన్ఫమ్‌ చేశాడు. సుజిత్‌ కథ లీక్‌ చేశాడు. 

PREV
15

పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ `ఓజీ` మూవీ. ఇది సుమారు మూడు వందల కోట్లు వసూలు చేసింది. దీనికి దర్శకుడు సుజీత్‌ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటించగా, ప్రకాష్‌ రాజ్‌, అర్జున్‌ దాస్‌, శ్రియా రెడ్డి వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ గతేడాది విడుదలైన విషయం తెలిసిందే. అదిరిపోయే విజయాన్ని సాధించి పవన్‌ కళ్యాణ్‌కి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. ఆయన రేంజ్‌ ఏంటో చూపించిందీ మూవీ. ఇప్పుడు దీనికి సీక్వెల్‌ పార్ట్ 2 రాబోతుంది.

25

`ఓజీ2` ఉండబోతుందని ఆ మూవీ ఎండ్‌ కార్డ్ లోనే వెల్లడించారు. కానీ ఇంత త్వరగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. తాజాగా పవన్‌ కళ్యాణ్‌ `ఓజీ 2`కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీన్ని పవన్‌ కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్ లో తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా ఎప్పుడుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో కన్ఫమ్‌ చేశారు. త్వరలోనే ఈ మూవీ ఉండబోతుందని తెలిపారు. నువ్వు ఎప్పుడంటే అప్పుడు సినిమా చేద్దామని పవన్‌ కళ్యాణ్‌.. దర్శకుడు సుజీత్‌కి హామీ ఇచ్చాడు.

35

ఈ సందర్భంగా ఓ వీడియోని విడుదల చేశారు. ఇందులో దర్శకుడు సుజీత్‌.. పవన్‌కి సినిమా కథని వివరిస్తున్నారు. అదే సమయంలో సినిమా కాన్సెప్ట్ ని రిఫ్లెక్ట్ చేసేలా కార్టూన్‌ బొమ్మలతో ఒక బుక్‌ని తయారు చేశారు. అది చూసి పవన్‌ మురిసిపోయారు. చాలా ఎగ్జైట్‌. మీ పేరు ఏంటి అని అడిగితే.. ఓజాస్‌ గాంభీర అని హీరో చెబుతాడు, అదే సినిమా ఫస్ట్ షాట్‌ అని తెలిపారు సుజీత్‌. దీంతో పవన్‌ చాలా ఇంప్రెస్ట్ అయ్యాడు.

45

అయితే గాంభీర ఫ్యామిలీ మన ఇండియా నుంచి జపాన్‌ యుద్ధానికి వెళ్లడం, అక్కడే సెటిల్‌ కావడం, గాంభీరం అక్కడ స్థానికంగా సమురాయ్‌గా ఎదగడం, అక్కడి పోలీసుల నుంచి ఇతర సమురాయ్స్ నుంచి ప్రమాదం పొంచి ఉండటం, వాళ్లని ఎదుర్కొని, పోలీసుల నుంచి తప్పించుకొని గోల్డ్ ని తీసుకొని ఇండియాకి రావడం అనే కథాంశంతో ఈ మూవీ సాగుతుందని తెలుస్తోంది. అయితే ఓజీ 2 మెయిన్‌గా జపాన్‌లో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందుతుందని ఈ వీడియోలో చూపించిన విజువల్స్ ని బట్టి అర్థమవుతుంది. గాంభీర ఓజీగా ఎలా మారడనేది ఇందులో చూపించబోతున్నట్టు తెలుస్తోంది.

55

తాజాగా వీడియోతో సినిమాపై అంచనాలను పెంచారు. ఇంకా మూవీనే ప్రారంభం కాలేదు, అప్పుడే హైప్‌ ఇస్తున్నారు. ఇది పవన్‌ అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. అయితే సినిమా ఎప్పుడు ప్రారంభం కాబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది ద్వితీయార్థంలోనే దీన్ని ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్‌ ప్రస్తుతం మరే సినిమాకి కమిట్‌ కాలేదు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఓ మూవీ అనుకున్నారు. కానీ దాని అప్‌ డేట్‌ లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు `ఓజీ 2` తర్వాతనే మరే సినిమా అయినా అని టాక్‌.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories