ధనుష్, ఐశ్వర్య
సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తెలలో ఒకరైన ఐశ్యర్యను ధనుష్ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు అబ్బాయిలు సంతానం. 18 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం 2022లో విడిపోతున్నట్లు ప్రకటించారు. వీరికి అధికారికంగా విడాకులు రావాల్సి ఉంది. కలిసి బ్రతకలేమని తాజా కోర్ట్ హియరింగ్ లో జడ్జికి చెప్పారట.
సమంత, నాగ చైతన్య
సమంత, నాగ చైతన్య పెళ్ళైన 4 ఏళ్ల తర్వాత విడాకులు ప్రకటించారు. ఈ స్టార్ కపుల్ విడాకుల ప్రకటన ఫ్యాన్స్ ని నిరాశకు గురిచేసింది. 2021లో అధికారికంగా విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. నాగ చైతన్య హీరోయిన్ శోభితను డిసెంబర్ 4న రెండో వివాహం చేసుకుంటున్నారు.
అమలా పాల్, ఏ ఎల్ విజయ్
అమలా పాల్, ఏ ఎల్ విజయ్ విడాకులు అప్పట్లో సంచలనం రేపాయి.విజయ్ పై అమలాపాల్ ఆరోపణలు చేసింది. మానసిక, శారీరక వేదనకు గురి చేశాడని అమలాపాల్ అన్నారు. పెళ్ళైన కొంత కాలానికే విడిపోయారు. అమలా పాల్ రెండో పెళ్లి చేసుకుంది.
దిలీప్, మంజు వారియర్
దిలీప్, మంజు వారియర్ ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం పరస్పర అవగాహనతో విడిపోయారు. దిలీప్ ఫ్యాన్స్ మంజు పై ఆరోపణలు చేశారు. ట్రోల్స్ కి పాల్పడ్డారు.
పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్
హీరో పవన్ కళ్యాణ్ 2012లో తన భార్య రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చాడు. ఆయన అభిమానులను ఈ పరిణామం షాక్‌కు గురి చేసింది. పవన్ మూడో వివాహంగా అన్నా లెజినోవాను చేసుకున్నారు.
సౌందర్య, అశ్విన్
సౌందర్య రజినీకాంత్ భర్త అశ్విన్ రామ్ కుమార్ తో 2017లో విడిపోయింది. 7 సంవత్సరాల వివాహ బంధానికి ముగింపు పలికింది. అనంతరం సౌందర్య రెండో వివాహం చేసుకుంది.
నాగార్జున, లక్ష్మీ
నాగార్జున, లక్ష్మీ దగ్గుబాటి 1984లో వివాహం చేసుకున్నారు. తర్వాత 1990లో విడాకులు తీసుకున్నారు. వీరు నాగ చైతన్య తల్లిదండ్రులు. లక్ష్మీ తో విడిపోయాక హీరోయిన్ అమలను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి అఖిల్ సంతానంగా ఉన్నాడు.
ఎ ఆర్ రెహమాన్, సైరా బాను
మూడు దశాబ్దాల వైవాహిక బంధం అనంతరం ప్రముఖ సంగీత దర్శకుడు ఎ ఆర్ రెహమాన్, భార్య సైరా బానుతో విడిపోతున్నట్లు ప్రకటించారు. 1995 మార్చి 12న వివాహం చేసుకున్న ఈ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు: ఖతీజా, రహీమా, ఎ ఆర్ అమీన్ వారి పేర్లు.