మీనాక్షి శేషాద్రి ‘మేరా జవాబ్’, ‘మహాశక్తిమాన్’, ‘లవర్ బాయ్’, ‘మా బేటీ’, ‘స్వాతి’, ‘పరివార్’, ‘సత్యమేవ జయతే’, ‘విజయ్’, ‘దామిని’ వంటి చిత్రాల్లో ఆమె నటించారు. 1991లో తెరకెక్కిన ‘బ్రహ్మశ్రీ విశ్వామిత్ర’తో ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఏడాది చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఆపద్బాంధవుడు’లో నటించి తెలుగువారి ప్రేమను పొందారు. 2016లో విడుదలైన ‘గాయల్ వన్స్ అగైన్’లో అతిథి పాత్రలో కనిపించారు.