బాలయ్య విలన్ అర్జున్ రాంపాల్ కు ఎంత కష్టం వచ్చింది

First Published | Aug 11, 2024, 8:30 AM IST

అర్జున్ రాంపాల్ చివరిసారిగా 'క్రాక్' చిత్రంలో నటించాడు. ప్రస్తుతం సంజయ్ దత్, రణవీర్ సింగ్‌లతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నాడు


బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘భగవంత్ కేసరి’ సినిమాలో విలన్ గా అర్జున్ రాంపాల్ నటించారు. ఆ సినిమా మంచి విజయం సాధించిపెట్టి తెలుగులోనూ ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే ఇప్పుడు ఆయనకు ఓ సమస్య వచ్చింది. దాంతో ఫ్యాన్స్ కు రిక్వెస్ట్ చేసారు.


 అర్జున్ రాంపాల్ సోషల్ మీడియా ఖాతా ఎక్స్(ట్విటర్ అకౌంట్) హ్యాకింగ్‌ గురైంది. ఈ విషయాన్ని నటుడు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. తన ఖాతా నుంచి ఏదైనా పోస్టులు వస్తే స్పందించవద్దని తెలిపారు. తన అభిమానులు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.



అర్జున్ రాంపాల్ చివరిసారిగా 'క్రాక్' చిత్రంలో నటించాడు. ప్రస్తుతం సంజయ్ దత్, రణవీర్ సింగ్‌లతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. ఆదిత్య ధర్ హెల్మ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరుగుతోంది. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, బీ62 బ్యానర్లపై జ్యోతి దేశ్‌పాండే, లోకేష్ ధర్, ఆదిత్య ధర్‌ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 
 


పర్శనల్ లైఫ్ విషయానికి వస్తే...ఇక ఈ ఏడాది జులైలో ఆయన నాలుగోసారి తండ్రయ్యారు. గర్ల్‌ఫ్రెండ్ గాబ్రియల్లా డెమిట్రియేడ్స్ ద్వారా 50 ఏళ్ల వయసులో నాలుగో బిడ్డకు తండ్రయ్యారు అర్జున్ రాంపాల్.  
 

Arjun Rampal


చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం వల్లే విడాకులు తీసుకోవాల్సి వచ్చిందంటున్నాడు బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌. నేను విచ్ఛిన్నమైన కుటుంబం నుంచి వచ్చాను. అక్కడ బంధాలు తెగిపోవడమే చూశాను. కానీ ఎందుకలా జరుగుతున్నాయనేది అర్థం చేసుకోలేకపోయాను. నాదాకా వస్తే కానీ అన్నీ అవగతం కాలేదు. అయినా విడాకులు తీసుకోవడానికి పూర్తి బాధ్యత నాదే అని చెప్పుకొచ్చారు. 


నాకు 24 ఏళ్లు ఉన్నప్పుడే పెళ్లి చేశారు. పెళ్లి చేసుకోవడానికి అది చాలా చిన్న వయసు. ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలెన్నో ఉంటాయి. పూర్తిగా మెచ్యూరిటీ వచ్చాకే వైవాహిక బంధంలో అడుగుపెట్టాలి. అమ్మాయిల కన్నా అబ్బాయిలు చాలా నెమ్మదిగా పరిణతి చెందుతారు. మేము ఇడియట్స్‌ అని ఇక్కడే తెలిసిపోతోంది. మూడుముళ్ల బంధం విజయవంతం కావాలంటే ఆ సమయం వచ్చేదాకా ఆగిన తర్వాతే పెళ్లి చేసుకోవాలి అన్నారు. 

Latest Videos

click me!