అయితే అదే క్రేజ్ ఆయన కొడుకు అకీరా నందన్ కి కూడా వస్తుంది. పవన్ క్రేజీ ఫ్యాన్స్ కొడుకుని కూడా ఫాలో అవుతున్నారు. ఇటీవల అకీరా నందన్ వీడియోలు థియేటర్లలో ప్రదర్శించడం విశేషం. ఇటీవల కాలంలో అకీరా నందన్ ఎక్కువగా బయట కనిపించాడు.
పవన్ ఎన్నికల్లో గెలిచినప్పుడు, చంద్రబాబు, మోడీని కలిసినప్పుడు, జనసేన ఆఫీసులో, ఎయిర్‌పోర్ట్ వద్ద ఇలా చాలా చోట్ల కనిపించాడు, వాటిని ఓ మ్యాషప్ వీడియోగా చేసి థియేటర్లలో ప్రదర్శించారు. దీనికి ఆడియెన్స్ ఊగిపోవడం విశేషం. ఇటీవల ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది.