Amaran: రెమ్యునరేషన్ గురించి స్టేజీ పైనే శివకార్తికేయన్ షాకింగ్ కామెంట్

Published : Feb 16, 2025, 06:49 AM ISTUpdated : Feb 16, 2025, 06:51 AM IST

'అమరన్' సినిమాలో తన పారితోషికం గురించి శివకార్తికేయన్ ఆశ్చర్యకరమైన నిజాన్ని వెల్లడించాడు. అతను తన పూర్తి రెమ్యూనరేషన్ చెల్లించాడా? ఈ ఊహించని పరిణామానికి సంబంధించిన వివరాలను తెలుసుకోండి.

PREV
13
Amaran:  రెమ్యునరేషన్  గురించి  స్టేజీ పైనే  శివకార్తికేయన్ షాకింగ్ కామెంట్
Sivakarthikeyan Shocking comments on Amaran full salary in telugu


Amaran: ప్రస్తుతం శివకార్తికేయన్ వరుస హిట్స్‌తో తమిళంలో దూసుకుపోతున్నాడు.  రీసెంట్ గా  'అమరన్‌'తో మంచి విజయాన్ని అందుకున్నారు హీరో శివకార్తికేయన్‌ (Siva karthikeyan). ముకుంద్‌ వరదరాజన్‌ పాత్రలో జీవించి ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నారు.

ఈ  క్రమంలో ఈ హీరో ఒక్కో సినిమా కోసం 25 నుంచి 30 కోట్ల మధ్య రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనే ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా  అమరన్ 100 రోజుల  పంక్షన్ లో శివకార్తికేయన్ తన  రెమ్యునరేషన్  గురించి చేసిన కామెంట్ ఇండస్ట్రీని, అభిమానులకు షాక్ ఇచ్చేలా చేసింది.  తాజాగా శివ కార్తికేయ‌న్ రెమ్యూనరేషన్ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఇంతకీ శివకార్తికేరన్ ఏమన్నారు.

23
Sivakarthikeyan Shocking comments on Amaran full salary in telugu


శివకార్తికేయన్, సాయి పల్లవి నటించిన అమరన్ చిత్రం 100 రోజుల పంక్షన్ రీసెంట్ గా చెన్నైలో జరిగింది. నిర్మాత కమల్, దర్శకుడు రాజ్ కుమార్ తో సహా హాజరైన ఈ ఈవెంట్ లో శివకార్తికేయన్ మాట్లాడుతూ... "నేను నా కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఆన్ టైమ్ లో రెమ్యునరేషన్ అందుకున్నాను.

ఇది చాలా అరుదైన విషయం. కొన్నిసార్లు నా రెమ్యునరేషన్ లో సగం వెనక్కి తీసేసుకుంటారు. అయితే మొదటి సారి సినిమా రిలీజ్ కు ఆరు నెలల ముందుగానే నా పూర్తి రెమ్యునరేషన్ తీసుకున్నాను. కమల్ కు చెందిన రామ్ కుమార్ ఇంటర్నేషనల్ మాకుఈ స్దాయి గౌరవం ఇచ్చింది. ఈ సంస్ద లాంటివి  అరుదు,” అని శివకార్తికేయన్ తేల్చి చెప్పారు. 

ఇది విన్న వాళ్లంతా గతంలో శివకార్తికేయన్ వంటి స్టార్ కు ఎప్పుడూ పూర్తి రెమ్యునరేషన్ అందలేదా అని షాక్ అయ్యారు.

33
Sivakarthikeyan Shocking comments on Amaran full salary in telugu

ఇక  గతంలోనూ అయలాన్ కోసం శివకార్తికేయన్ భారీ రెమ్యునరేషన్‌ను వదులుకోవడం కోలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది .అయలాన్ మూవీ కోసం శివకార్తికేయన్ రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదట… ఈ విషయాన్ని అయలాన్ ఆడియో లాంఛ్ ఈవెంట్‌లో సినిమా యూనిట్ స్వయం గా వెల్లడించింది.

 

 దేశం కోసం ప్రాణాలు అర్పించి అమరుడైన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా అమరన్ మూవీలో ముకుంద్ పాత్రలో శివకార్తీకేయన్ (Siva karthikeyan), ఆయన భార్య ఇందు రెబాకా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి కనిపించారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories