మన్యం జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న పవన్.. కొడుకు ఆరోగ్యం ఎలా ఉంది? ఘటన ఎలా జరిగిందనేది వెల్లడించారు. తాను అరకు పర్యటనలో ఉండగా, మార్క్ శంకర్‌కు గాయాలైనట్టు ఉదయం 8.30 గంటలకు ఫోన్ వచ్చిందన్నారు. సమ్మర్ క్యాంపులో అగ్ని ప్రమాదం జరిగి తన కొడుకు చేతులు, కాళ్లకి గాయాలు అయినట్టు, ఊపిరితిత్తుల్లోకి పొగ చేరిందని చెప్పారు.
తన పక్కనే కూర్చున్న చిన్నారి మృతి చెందడం బాధించిందన్నారు. సుమారు 30 మంది చిన్నారులు సమ్మర్ క్యాంపులో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. మొదట అగ్నిప్రమాదం చిన్నదే అనుకున్నా, కానీ దాని తీవ్రత తెలిసిందన్నారు పవన్.