అఖిల్ పెళ్లికి, వైస్ ఎస్ జగన్ కు సంబంధం ఏంటి, మాజీ సీఎంతో బయటపడ్డ నాగార్జున రహస్య స్నేహం

First Published | Nov 27, 2024, 7:58 PM IST

అఖిల్ పెళ్ళాడబోయే జైనబ్  ఫ్యామిలీకి.. ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఏంటి సబంధం..? అఖిల్ కంటే జైనబ్ వయసులో పెద్దదా..? నాగార్జున ఈ పెళ్ళి చేయడం వెనుక కారణం ఏంటి..? 
 

అఖిల్ పెళ్లి గురించి ప్రకటన చేసి అందరికి షాక్ ఇచ్చాడు కింగ్ నాగార్జున. సడెన్ గా అఖిల్ పెళ్ళి ఏంటి. అది కూడా ఏంగేజ్మెంట్ జరిగిన తరువాత ఇలా ప్రకటించడం వెనుక కారణం ఏంటి..? నాగచైతన్య పెళ్లి డిసెంబర్ 4న జరుగుతండగా.. అఖిల్ పెళ్లి కూడా అప్పుడే  చేయబోతున్నారా..? ఇంతకీ అఖిల్ ది ప్రేమ పెళ్లా..? లేక అరేంజ్డ్ మ్యారేజా.. ఇలా రకరకాల ప్రశ్నలు వినిపిస్తున్న క్రమంలో.. అఖిల్ పెళ్లికి ఏపీ మాజీ సీఎం జగన్ కు లింక్ ఒకటిబయట పడింది. అందరిని ఆశ్చర్యపరుస్తోంది. 

Also Read:  47 ఏళ్లకు పెళ్లి చేసుకున్న సుబ్బరాజు , అమ్మాయి ఎవరో తెలుసా..?
 

Akhil Engagement

ఇంతకీ విషయం ఏంటంటే..? తాజాగా అఖిల్ పెళ్లిని ముంబయ్ కి చెందిన నటి, మల్టీటాలెంటెడ్ జైనబ్ రవ్జీ తో ప్రకటించాడు నాగార్జున. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందని అన్నారు. అయితే  అఖిల్ చేసుకోబోయే అమ్మాయి అతని కంటే దాదాపు 9 ఏళ్లు పెద్దదని సమాచారం.అఖిల్ కి 30 ఏళ్ళు కాగా జైనబ్ రవ్జీకి 39 ఏళ్ళు అని తెలుస్తోంది.  ఇక జైనాబ్ ప్యామిలీతో ఏపీ మాజీ సీఎం జగన్ కు దగ్గర సబంధం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇంతకీ ఏంటా రిలేషన్. 

Also Read: పవన్ కళ్యాణ్ ఇంట్లో పెత్తనం ఎవరిదో తెలుసా..? పవర్ స్టార్ ను కూడా కంట్రోల్ చేసే ఆ లేడీ ఎరంటే..?


జైనబ్ రవ్జీ తండ్రి  ప్రముఖ బిజినెస్ మెన్. ఆయన పేరు జుల్ఫీ రవ్జీ, ఆయనకు ఎన్నో బిజినెస్ లు ఉన్నాయట.  ZR Renewable Energy తో పాటు పలు కన్స్ట్రక్షన్ కంపెనీలకు అతను యజమాని. అంతే కాదు  ఇండియా తో పాటు  దుబాయ్, లండన్ లాంటి దేశాల్లో వీరికి బిజినెస్ లు ఉన్నాయని సమాచారం.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కు జైనాబ్ రవ్జీ తండ్రి జుల్ఫీ రావడ్జీ అత్యంత సన్నిహితుడు. ఏపీ ప్రభుత్వంలో కూడా ఆయన సలహాదారుడిగా పనిచేశాడు. అంతే కాదు  దుబాయ్ తో పాటు దాని చుట్టు పక్కల ఉన్న అరబ్ దేశాల్లో ఏపీ ప్రభుత్వం తరపున జగన్ అడ్వైజర్ గా కూడా ఆయన  ఉన్నారని సమాచారం.

ఇక హీరోగా, బిజినెస్ మ్యాన్ గా కెరీర్ ను బ్యాలెన్స్ చేస్తూ వస్తోన్న కింగ్  నాగార్జునకు కూడా వీరిద్దరికి  బిజినెస్ పరంగా అత్యంత సన్నిహితుడు అని తెలుస్తుంది. జుల్ఫీ రవ్జీ – నాగార్జున మధ్య చాలా కాలం నుంచి ఫ్రెడ్షిప్ ఉందట. 

Also Read: భార్య వసుంధర ముందే బాలకృష్ణకు ముద్దు పెట్టిన హీరోయిన్ ఎవరో తెలుసా..? అప్పుడే ఏం జరిగిందంటే..?

ఈరకంగా జగన్ తో నాగార్జున వ్యాపార సంబంధాలు కూడా కలిగి ఉన్నట్టు తెలుస్తుంది. ఈ పెళ్లితో  వైఎస్ జగన్ - నాగార్జున  బంధం మరింత బలపడబోతున్నాయని అంటున్నారు. అయితే ఇప్పుడు అక్కినేని అభిమానులకు ఇక్కడే పెద్ద కన్ఫ్యూజన్ ఎదురయ్యింది. అఖిల్ తనకంటే పెద్దదైన  జైనాబ్ రవ్జీ ని ప్రేమ పెళ్లి చేసుకుంటున్నారా.. లేక వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లా అనేది క్లారిటీ లేదు. ఇక్కడే మరికొన్ని విషయాలు వెల్లడి అవుతున్నాయి.

Also Read: జీవితంలో మందు ముట్టని ఫిల్మ్ స్టార్స్ ఎవరో తెలుసా..? ఆల్కహాల్ కు దూరంగా ఉండటానికి కారణం ఇదే..?

Akhil Akkineni

 అదేంటంటే.. జైనబ్ రవ్జీ థియేటర్ ఆర్టిస్ట్.. పెయింట్ ఆర్టిస్ట్ కూడా. ఆమె వేసిన పెయింట్స్ పలు పెయింట్ ఎగ్జిబిషన్స్ లో ప్రదర్శించబడినట్టు తెలుస్తుంది. ఇక జైనాబ్ రవ్జీ హైదరాబాద్ లో పుట్టినా ఢిల్లీ, దుబాయ్, ముంబైలో పెరిగింది. ప్రస్తుతం ముంబైలో ఉంటున్నట్టు సమాచారం.  ఇక జైనాబ్ కు  రానా భార్య మిహిక బాజాజ్, రామ్ చరణ్ భార్య ఐపాసన తో పాటు హీరోయిన మెహ్రీన్ కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అంట. 

Also Read: ప్రభాస్ డ్రీమ్ రోల్ ఎంటో తెలుసా..? ఇప్పటికీ ఆ పాత్ర కోసం ఎదరుచూస్తోన్న రెబల్ స్టార్..

అంతే కాదు జైనాబ్ ఓ బ్యూటీ కేర్ కంపెనీని కూడా రన్ చేస్తోందట. ఈక్రమంలో అఖిల్, జైనాబ్ పరిచయం  రానా – మిహీక పెళ్ళిలో జరిగిందని. ఈ పెళ్లిలో వీరు కలుసుకొని ఇన్నాళ్లు ప్రేమించుకొని ఇప్పుడు పెళ్ళికి రెడీ అవుతున్నారని అంటున్నారు.మరోవైపు నాగార్జున – జుల్ఫీ రవ్జీ మధ్య వ్యాపార సంబంధాలు, స్నేహంతో ఈ పెళ్ళిని పెద్దలు కుదిర్చారని మరో మాట వినిపిస్తుంది. 
 

ఇక  సోషల్ మీడియాలో ఎప్పుడ యాక్టీవ్ గా ఉండే జైనాబ్. తాజాగా  అఖిల్ తో నిశ్చితార్థం ప్రకటించాక ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ని ప్రైవేట్ గా మార్చేసింది. ఆమె అకౌంట్ ని రానా, మిహీక, ఉపాసన, మెహ్రీన్.. ఇలా పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే ఫాలో అవుతున్నారు. వీరి పెళ్లి ఎప్పుడు జరుగుతంది. ఇతర వివరాలు అక్కినేని ఫ్యామిలీ ఇంకా ప్రకటించలేదు. త్వరలో ఈ ప్రకటన కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. 
 

Latest Videos

click me!