Akkineni: అఖిల్ అక్కినేనికి సక్సెస్ రాకపోవడానికి కారణం ఏంటి? ఆయన పేరు కలిసిరావడంలేదా? అక్కినేని హీరోల నేమ్ సెంటిమెంట్ అఖిల్ ను విజయానికి దూరం చేస్తుందా? ఓ అభిమాని చెప్పిన అసలు రహస్యం ఏంటి?
అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన తాజా చిత్రం 'లెనిన్' విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ జోరు పెంచింది. అఖిల్ గతంలో పెద్దగా మాట్లాడేవాడు కాదు, అక్కినేని అభిమానులను పెద్దగా పట్టించుకోలేదు కూడా. కానీ మునుపటిలా కాకుండా కాస్త స్పీడ్ పెంచాడు. ఎక్కువగా అభిమానులతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాడు. తనను తాను నిరూపించుకనే అవకాశం ఇవ్వాలని అభిమానులను అడుగుతున్నాడు.
24
అఖిల్ పేరు కలిసిరావడంలేదా..?
ప్రస్తుతం అక్కినేని అభిమానుల్లో ఓ సెంటిమెంట్ బలంగా వైరల్ అవుతోంది. అఖిల్ సక్సెస్ అవ్వకపోవడానికి నేమ్ సెంటిమెంట్ ఏమైనా పనిచేస్తుందా అన్న అనుమానం వస్తోంది. అక్కినేని హీరోల అందరికి పేరుకు ముందు నాగ ఉంటుంది. కానీ అఖిల్ పేరుకి మాత్రం అది తగిలించలేదు. అందుకే ఈ యంగ్ హీరో సక్సెస్ సాధించలేకపోతున్నాడా అని అక్కినేని అభిమానులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఇక ఒక వీరాభిమాని అయితే.. అఖిల్ కు కొత్త పేరు సూచిస్తూ.. ఆయన ముందే డైరెక్ట్ కామెంట్స్ చేశాడు. తిరుపతిలో జరిగిన ఈవెంట్ లో ఆ అభిమాని మాట్లాడిన మాటలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగించాయి.
34
అఖిల్ కు కొత్త పేరు ప్రతిపాదించిన అభిమాని..
లెనిన్ మూవీ ఈవెంట్ లో అఖిల్, నాగార్జున ప్రసంగాలు అభిమానులను ఆకట్టుకున్నప్పటికీ, ఓ అక్కినేని అభిమాని చేసిన వినూత్న ప్రతిపాదన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన అభిమాన హీరో పేరు మార్చుకోవాలని సూచిస్తూ, దాని వెనుక ఉన్న సెంటిమెంట్‌ను వివరించడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లెనిన్ ఈవెంట్ లో మాట్లాడిన ఆ అభిమాని, అఖిల్ తన పేరును 'నాగ అఖిల్' గా మార్చుకుంటే బాగుంటుందని సూచించాడు. ఈ పేరు వెనుక ఉన్న కారణాన్ని కూడా ఆయన వివరించారు. 'నాగ' అనే పదం అఖిల్ తాత అక్కినేని నాగేశ్వరరావు, తండ్రి నాగార్జున పేర్ల నుంచి తీసుకున్నదని చెప్పారు. అలాగే పేరులోని 'అ' అక్షరం నానమ్మ అన్నపూర్ణమ్మ, తల్లి అమల పేర్లకు గుర్తుగా ఉంటుందని వివరించారు.
ఈ విధంగా కుటుంబంలోని నలుగురు పెద్దల ఆశీస్సులు ఎప్పుడూ అఖిల్‌కు ఉండాలనే ఉద్దేశంతో 'నాగ అఖిల్' అనే పేరును సూచిస్తున్నట్లు ఆ అభిమాని వెల్లడించారు. ఆయన మాటలు ముగిసిన వెంటనే సభలో చప్పట్లు మార్మోగాయి. అక్కడున్న అభిమానుల నుంచి కూడా ఈ ప్రతిపాదనకు సపోర్ట్ లభించింది. అక్కినేని కుటుంబంలో 'నాగ' అనే పదానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు నుంచి నాగార్జున, నాగ సుశీల, నాగ చైతన్య వరకు కుటుంబంలోని పలువురి పేర్లలో ఈ పదం భాగంగా ఉంది.
నాగ పేరు ఉన్నవారంతా సక్సెస్ అయ్యారు. నాగచైతన్య కూడా తన కెరీర్ లో అద్భుతంగానే రాణిస్తున్నాడు. అఖిల్ మాత్రం కెరీర్ బిగినింగ్ నుంచి సాలిడ్ హిట్ లేక ఇబ్బందిపడుతున్నాడు. అందుకే అఖిల్ పేరుకు కూడా నాగ ను జోడించాలని అభిమానులు కోరుతున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. "నాగ అఖిల్ అనే పేరు బాగుంది", "అభిమాని ఆలోచన చాలా బాగుంది" అంటూ కామెంట్లు చేస్తున్నారు.