Karthika Deepam 2 Today Episode: కార్తీక్‌ అనుమానం- సూరజ్ పెళ్లి ప్రపోజల్- కొత్త క్యారెక్టర్ ఎంట్రీ

Published : Jul 07, 2026, 10:27 AM IST

Karthika Deepam 2 Today Episode (జూలై 7వ తేదీ)లో తల్లి గురించి బాధపడ్డ దీప. సూరజ్ పై కార్తీక్ డౌట్. సూరజ్ ని రెచ్చగొట్టేలా మాట్లాడిన జ్యో. పెళ్లి చేసుకుందామని జ్యోను అడిగిన సూరజ్. కొత్త క్యారెక్టర్ ఎంట్రీ. ఈ రోజు ఎపిసోడ్ లో ఇంకా ఏం జరిగిందంటే.. 

PREV
15
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ మంగళవారం ఎపిసోడ్ లో కిచెన్ లో జ్యూస్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది దీప. కార్తీక్ వచ్చి దీప అని పిలిచినా అలాగే ఉండిపోతుంది. ఏమైంది నీకు అంతలా ఏం ఆలోచిస్తున్నావు. ఈ జ్యూస్ ఎవరికీ అని అడుగుతాడు కార్తీక్. అమ్మతో మాట్లాడాలి. ఊరికే వెళ్లలేను అందుకే ఈ జ్యూస్ అని చెప్తుంది దీప. అత్తతో ఏం మాట్లాడాలి అని అడుగుతాడు కార్తీక్. సూరజ్ పై అమ్మకు కూడా అనుమానం ఉందో అడగాలి అంటుంది దీప. సూరజ్ పై నాకు కూడా అనుమానం ఉంది అంటాడు కార్తీక్. 

అదేంటీ అని అడుగుతుంది దీప. సూరజ్ ఎవరో మనకు తెలియదు. ఎక్కడి నుంచో వచ్చాడో మనకు తెలియదు. మనకు ఏమి తెలియని వ్యక్తి మన శత్రువుతో మాట్లాడాడు అంటే అనుమానించాల్సిన విషయమే కదా అంటాడు కార్తీక్. ఈ ఇంట్లో ఉంటూ ఈ ఇంటి ఫుడ్ తిన్న జ్యోత్స్ననే ఈ ఇంటికి ద్రోహం చేయడానికి వెనుకాడలేదు. ఇక బయటవాళ్లను ఎలా నమ్ముతామని అంటాడు కార్తీక్. తాత కొట్టినందుకు సూరజ్ బాధపడుతున్నాడేమో అంటుంది దీప. బ్రదర్ చాలా పాజిటివ్ గా తీసుకున్నాడే అని మనసులో అనుకుంటాడు కార్తీక్.

25
సూరజ్ ని రెచ్చగొట్టేల జ్యో మాటలు

మరోవైపు స్కూటీ క్లీన్ చేస్తుంటాడు సూరజ్. జ్యోత్స్న వెళ్లి.. సూరజ్ ని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. మా తాత నిన్ను అనుమానించాడు. అవమానించాడు.. కొట్టాడు, ఇక నీ ముఖం మళ్లీ ఈ ఇంట్లో ఎలా చూపించగలవు. ఇక నువ్వు అన్నీ సర్దుకొని బయల్దేరితే, నీకు బై చెప్పి నేను గేటు వేసుకొని లోపలికి వెళ్తాను అంటుంది జ్యోత్స్న. 

వసపిట్ట లాగా ఊరికే ఎందుకు అరుస్తావే, నేను ఎక్కడికి వెళ్లను ఆయన నా మీద కోపంతో కొట్టలేదు. అభిమానంతో అనుమానం తీర్చుకోవడానికి కొట్టాడు. ఆయన నన్ను నమ్మాడు. నమ్మకం ఉన్న చోటే అనుమానం ఉంటుంది. నేను తన మనిషిని అనుకున్నాడు కాబట్టే నన్ను కొట్టాడు. అందుకే ఆ దెబ్బ నా చెంపకు తగిలింది కానీ, నా మనసుకు తాకలేదు అంటాడు సూరజ్.

35
సూరజ్ పెళ్లి ప్రపోజల్

మా తాతను బాగానే అర్థం చేసుకున్నావ్. మరి నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు రా అంటుంది జ్యోత్స్న. అర్థం చేసుకున్నాను కాబట్టే అర్థాంగిని చేసుకోవాలి అనుకుంటున్నాను. నువ్వు సరే అను.. ఇప్పుడే పెళ్లి చేసుకుందాం అంటాడు సూరజ్. నాలాంటి ఏంజిల్ ని అందుకోవాలంటే ఒక స్థాయి ఉండాలి అది నీకు లేదు అన్నట్లు సూరజ్ ని తక్కువ చేసి మాట్లాడుతుంది జ్యోత్స్న.

నీ వెనుక మీ తాత సంపాదించిన ఆస్తి, గౌరవం ఉన్నాయి. అవి పక్కనపెడితే నువ్వు అనామకురాలివే అంటాడు సూరజ్. కోపంగా చూస్తుంది జ్యోత్స్న. మన పెళ్లి ఈ ఇంట్లోనే చేసుకుందాం. ఓ తథాస్తు దేవత తథాస్తు అను. మమ్మల్ని కలిపేందుకు నువ్వే ఈ భూమి మీదకు దిగిరావాలి అని అంటాడు సూరజ్. అప్పుడే ఒక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది.

45
మాలిని క్యారెక్టర్ ఎంట్రీ

ఒక లేడీ ఒక ఫేమస్ రెస్టారెంట్ లో కాఫీ తాగి.. ఆ రెస్టారెంట్ ఓనర్ ని కలవాలి అనుకుంటుంది. అక్కడి స్టాఫ్ కుదరదని చెప్తే.. తన విజిటింగ్ కార్డు ఇచ్చి ఓనర్ దగ్గరకు పంపిస్తుంది. ఆ విజిటింగ్ కార్డు మీద మాలిని అనే పేరు చూసి ఆ ఓనర్ షాకై.. ఆవిడను లోపలికి రమ్మనండని చెప్తాడు. లోపలికి వెళ్లిన మాలిని చూసి.. మీది సేమ్ బిజినెస్ కదా మాలిని గారు.. మీరు నా హోటల్ కు వచ్చి కాఫీ తాగడం ఏంటీ? అని అడుగుతాడు ఆ ఓనర్. ఈ హోటల్ ను కొనాలనుకుంటున్నాను. మార్కెట్ రేటు కంటే డబల్ ఇస్తాను అని చెప్తుంది మాలిని. ఆ ఓనర్ ఒప్పుకోడు. అక్కడి నుంచి వెళ్లిపోతుంది మాలిని.

55
పర్మిషన్ అడిగిన సూరజ్

మరోవైపు శివన్నారాయణ ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చొని ఉంటారు. అప్పుడే సూరజ్ వెళ్లి, రేపు ఆఫీస్ కు 2 గంటలు లేటుగా వస్తానని దీప దగ్గర పర్మిషన్ తీసుకుంటాడు. 2 గంటల టైం ఎందుకో అడుగురా అని కార్తీక్ తో చెప్తుంది పారు. నీకు సొంతవాళ్లు ఎవరూ లేరు కదా మరి 2 గంటల టైమ్ ఎందుకు? అని అడుగుతాడు కార్తీక్. చెప్పడానికి కాస్త ఇబ్బందిగా ఉందని అంటాడు సూరజ్. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories