మెగాస్టార్ చిరంజీవి నుంచి రాజేంద్రప్రసాద్ వరకు ఐదుగురు టాలీవుడ్ హీరోలు అద్భుతమైన నటన కనబరిచారు. అయినప్పటికీ వాళ్లకు జాతీయ అవార్డు దక్కలేదు. ఆ సినిమాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇప్పుడిప్పుడే నేషనల్ అవార్డులలో సౌత్ హీరోలకు ప్రాధాన్యం దక్కుతోంది. ఇటీవల కాలంలో సూర్య, కీర్తి సురేష్, అల్లు అర్జున్ లాంటి వారు ఉత్తమ నటులుగా జాతీయ అవార్డులు అందుకున్నారు. కానీ గతంలో సౌత్ నటులకు జాతీయ అవార్డుల్లో అంతగా ప్రాధాన్యం దక్కేది కాదు అనే విమర్శ ఉండేది. జాతీయ అవార్డుల జ్యూరీ సౌత్ నటుల్ని ముఖ్యంగా తెలుగు హీరోలని చిన్న చూపు చూసేవారు అనే విమర్శ ఉండేది. ఈ 5 సినిమాలని గమనిస్తే ఆ అనుమానం నిజం అనే భావన కలగడం ఖాయం. చిరంజీవి నుంచి రాజేంద్ర ప్రసాద్ వరకు ఐదుగురు హీరోలు ఈ చిత్రాల్లో నట విశ్వరూపం ప్రదర్శించారు. అయినప్పటికీ జాతీయ అవార్డుకు నోచుకోలేకపోయారు.
26
రుద్రవీణ - చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి తన ఇమేజ్ ని పక్కన పెట్టి చేసిన సందేశాత్మక చిత్రం రుద్రవీణ. ఈ చిత్రానికి వివిధ విభాగాల్లో జాతీయ అవార్డులు దక్కాయి. కానీ నటుడిగా మాత్రం చిరంజీవికి నేషనల్ అవార్డు దక్కలేదు. తండ్రిని ఎదిరించే విప్లవాత్మక సన్నివేశాల్లో చిరంజీవి నటన అద్భుతంగా ఉంటుంది.
36
అన్నమయ్య - అన్నయ్య
అక్కినేని నాగార్జున తన కెరీర్ లో అద్భుతమైన నటన కనబరిచిన చిత్రం అన్నమయ్య. ఈ మూవీలో భక్తి భావోద్వేగ నటనతో పాటు నాగార్జున నవరసాలు పండించారు. ఈ మూవీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయినప్పటికీ ఉత్తమ నటుడిగా నాగార్జునకి జాతీయ అవార్డు దక్కలేదు.
ఈ మూవీలో వెంకటేష్ అమాయకుడైన కుర్రాడి పాత్రలో పండించిన నటన నెవర్ బిఫోర్. జమిందారీ వ్యవస్థ, సమాజంలో ఉండే కట్టుబాట్లు లాంటి అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ చిత్రానికి వెంకటేష్ జాతీయ అవార్డుకు అర్హుడు. కానీ బ్యాడ్ లక్.
56
రంగస్థలం - రాంచరణ్
మెగా పవర్ స్టార్ రాంచరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో రంగస్థలం ఒకటి. నటన పరంగా కూడా రాంచరణ్ కి ఇది బెస్ట్ మూవీ. ఈ మూవీలో వినికిడి లోపం ఉన్న కుర్రాడిగా రాంచరణ్ నట విశ్వరూపం ప్రదర్శించారు. ఈ మూవీలో చరణ్ కి జాతీయ అవార్డు ఖాయం అనుకున్నారు. కానీ అది ఓ హిందీ హీరోకి వెళ్ళిపోయింది. రంగస్థలం చిత్రంలో నటనకు రాంచరణ్ జాతీయ అవార్డుకు అర్హుడు అని చాలా మంది భావిస్తుంటారు.
66
ఆ నలుగురు - రాజేంద్రప్రసాద్
ఇది అద్భుతమైన సందేశాత్మక చిత్రం. సాధారణంగా హాస్యం పండించే రాజేంద్ర ప్రసాద్ ఈ మూవీలో తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో భావోద్వేగాలు రగిలించారు. ఈ చిత్రంతో రాజేంద్ర ప్రసాద్ కి ఉత్తమ నటుడిగా నంది అవార్డు వచ్చింది కానీ జాతీయ అవార్డు దక్కలేదు.