Ram Gopal Varma Support Rajamouli : వారణాసి వివాదంపై స్పందించాడు రామ్ గోపాల్ వర్మ. రాజమౌళి కి సపోర్ట్ చేస్తూనే.. విమర్శలు చేస్తున్నవారికి స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చాడు. చాలా రోజులు తరువాత వర్మ తన మార్క్ కామెంట్లతో రెచ్చిపోయాడు.
ప్రస్తుతం టాలీవుడ్ లో రాజమౌళి రచ్చ కొనసాగుతోంది. వారణాసి ఈవెంట్ లో దేవుడిపై రాజమౌళి చేసిన కామెంట్స్ తో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. దేవుడిపై తనకు నమ్మకం లేదని, కోపం వస్తుందంటూ.. జక్కన్న నోరు జారడంతో.. ఆ వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. ఈకామెంట్స్ పై పలు హిందూ సంఘాలు,నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, రాజమౌళి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యలో, ఈ వివాదంపై వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందంచారు. తన సోషల్ మీడియా పేజ్ లో స్పందించిన వర్మ.. రాజమౌళి కి సపోర్ట్ గా కామెంట్స్ చేశారు. తన మార్క్ డైలాగ్స్ తో రెచ్చిపోయాడు ఆర్జీవి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే?
25
అంత పెద్ద నేరం ఏం చేశాడు?
ఆర్జీవీ తన పోస్ట్ లో డిఫరెంట్ గా స్పందించాడు. ముందుగా రాజమౌళి పై విమర్శలు చేస్తున్న వారిని ఉద్దేశించి ఆయన రాస్తూ.. ''భారతదేశంలో నాస్తికుడిగా ఉండటం ఎలాంటి నేరం కాదు, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం, దేవుడిని నమ్మకపోవడం కూడా వ్యక్తిగత స్వేచ్ఛ కిందకే వస్తుంది, మీకు దేవుడిని నమ్మే హక్కు ఎంత ఉందో.. రాజమౌళి కి దేవుడిని నమ్మకపోవడానికి కూడా అంతే హక్కు ఉంది” అని ఆర్జీవీ అన్నారు.
35
దేవుడిపై సినిమా తీయ్యాలంటే నమ్మకం ఉండాలా?
అంతే కాదు దేవుడి సినిమా తీయ్యాలంటే.. దేవుడిపై నమ్మకం ఉండాలని రూల్ ఉండా అని వర్మ ప్రశ్నించారు. అలా మాట్లాడేవారిది “మూర్ఖపు వాదన”గా ఆయన అభివర్ణించారు. “ఒక దర్శకుడు గ్యాంగ్‌స్టర్ సినిమా తీశాడంటే అతను గ్యాంగ్‌స్టర్ కావాలా? హారర్ సినిమా తీయాలంటే దెయ్యమవ్వాలా?” అంటూ ఘాటుగా ప్రశ్నించాడు రామ్ గోపాల్ వర్మ. రాజమౌళి నాస్తికుడైనా, ఆయన సాధించిన విజయాలను గుర్తుచేస్తూ, ఆర్జీవీ సపోర్ట్ గా మాట్లాడారు.
రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ.. దేవుడిపై కూడా తనదైన మార్క్ లోకామెంట్లు చేశారు. “దేవుడిని ఎంతగా నమ్మిన వారికీ రాని విజయం, సంపద నాస్తికుడైన రాజమౌళి కి వచ్చింది. దీనిబట్టి చూస్తే దేవుడు నాస్తికులను ఎక్కువగా ప్రేమిస్తున్నాడేమో, లేదా అసలు దేవుడు మనుషులను పట్టించుకోడేమో, రాజమౌళి నాస్తికత్వమే అసలు సమస్య కాదు, దేవుడిని నమ్మకుండానే ఆయన విజయం సాధించడం కొందరిని భయపెడుతోంది. '' అని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. “
55
అసూయపడుతున్నారా?
దేవుడిని రక్షిస్తున్నామని చెప్పుకునే వారిపై వర్మ చమత్కారాలు విసిరాడు. “దేవుడు బాగానే ఉన్నాడు. రాజమౌళి కూడా బాగానే ఉన్నాడు. వీరిద్దరినీ అర్థం చేసుకోలేని వారే బాధపడుతున్నారు. వారణాసి సినిమా వల్ల దేవుడు ఆయన బ్యాంక్ బ్యాలెన్స్‌ను ఇంకా పెంచుతాడు. అసూయపడే వారు చూడడమే తప్ప మరో దారి ఉండదు” అంటూ తనదైన స్టైల్ లో ఇచ్చిపడేశాడు రామ్ గోపాల్ వర్మ. మరి వర్మ కామెంట్లకు కౌంటర్లు వస్తాయా లేదా అనేది చూడాలి.