`అఖండ 2 తాండవం` టైటిల్‌ సాంగ్‌ రివ్యూ.. ఈ రేంజ్‌లో మూవీ ఉంటే థియేటర్లు ఊగిపోవాల్సిందే

Published : Nov 14, 2025, 08:17 PM IST

Akhanda 2 Thaandavam: బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను రూపొందిస్తోన్న `అఖండ 2 తాండవం` సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌ విడుదలైంది. ఇది ఆద్యంతం పూనకాలు తెప్పించేలా సాగడం విశేషం. 

PREV
15
`అఖండ 2 తాండవం` ప్రమోషన్స్ షురూ

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ `అఖండ 2 తాండవం`. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఇందులో ఆదిపినిశెట్టి విలన్‌గా నటిస్తున్నారు. సంయుక్త హీరోయిన్‌గా నటిస్తోంది. బాలయ్య, బోయపాటి లది హిట్‌ కాంబినేషన్‌. వీరి కాంబోలో వచ్చిన మూడు `సింహ`, `లెజెండ్‌`, `అఖండ` సినిమాలు బ్లాక్‌ బస్టర్‌గా నిలిచాయి. ఇప్పుడు నాల్గో మూవీగా `అఖండ 2` రాబోతుంది. ఈ సినిమా డిసెంబర్లో విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్స్ కార్యక్రమాలను స్టార్ట్ చేశారు.

25
`అఖండ 2 తాండవం` టైటిల్‌ సాంగ్‌ ఔట్‌

`అఖండ 2` నుంచి ఇప్పటికే రెండు గ్లింప్స్ లు వచ్చాయి. బాలయ్య రెండు పాత్రల్లో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఓ పాత్రలో అఘోరగా కనిపిస్తారు. మొదట అఘోర లుక్‌ని, ఆ పాత్రకి సంబంధించిన గ్లింప్స్ ని చూపించారు. ఆ తర్వాత మరో పవర్‌ ఫుల్‌ రోల్‌ని చూపిస్తూ గ్లింప్స్ విడుదల చేశారు. ఇప్పుడు సినిమాలోని టైటిల్‌ సాంగ్‌ని విడుదల చేశారు. ఈ మేరకు ముంబయిలో ఈవెంట్‌ కూడా నిర్వహించారు. ఇందులో బాలయ్య, బోయపాటి ఇలా చాలా వరకు హిందీలో మాట్లాడి అక్కడి ఆడియెన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక తాజాగా విడుదలైన తాండవం పాట సైతం ఆద్యంతం ఆకట్టుకుంటోంది.

35
బాలయ్య విశ్వరూపాన్ని చూపించేలా తాండవం సాంగ్‌

`అఖండ తాండవం` అంటూ సాగే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకోవడమే కాదు, గూస్‌ బంమ్స్ తెప్పిస్తోంది. బాలయ్య ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే సాంగ్‌ అని చెప్పొచ్చు. ఇందులో బాలయ్య అఘోర పాత్రని చూపించారు. ఆయన నటవిశ్వరూపాన్ని ఆవిష్కరించారు. హిమాలయాల్లో ఆయన చేసే శివ తాండవాన్ని ఆవిష్కరించేలా ఉంది. ఆ యాక్షన్‌ కూడా అదిరిపోయేలా ఉంది. ఇది అఘోర ఎపిసోడ్‌కు సంబంధించి హైలైట్‌గా ఉంటుందని, ఆయన పాత్ర జర్నీని తెలియజేస్తూనే, ఆ పవర్‌ ముందు ప్రత్యర్థులు నిలవలేరు అనేలా సాగుతుందని, అత్యంత శక్తివంతమైన బాలయ్య పాత్రని ఆవిష్కరించే పాట అవుతుందనిపిస్తోంది. ఇందులో శివుడి రూపంగా బాలయ్య కనిపిస్తున్నారు. అదే సమయంలో పాటలోనూ బాలయ్య పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో వర్ణించారు. ఆ లిరిక్‌ కూడా చాలా శక్తివంతంగా ఉండటం విశేషం. ఈ పాట, ఇందులో బాలయ్య చేసే సాహసాలు ఆడియెన్స్ కి ట్రీట్‌లా ఉంటాయని చెప్పొచ్చు.

45
బాలయ్య కోసం థమన్‌ హై వోల్టేజ్‌ సౌండ్‌ ట్రాక్‌

`అఖండ 2 తాండవం` నుంచి విడుదలైన ఈ మొదటి పాటకి ఎస్ థమన్ సంగీతం అందించారు. బాలయ్యకు హై వోల్టేజ్ సౌండ్‌ట్రాక్‌ల అదించే ఎస్‌.థమన్‌ ‘అఖండ 2’ కోసం మరోసారి డివైన్ ఫుల్ సాంగ్ ఇచ్చారు. ఈ పాటలో బాలకృష్ణ అఘోర అవతారంలో, అఘోర మంత్రాలతో దద్దరిల్లుతున్న భారీ ఆలయ ప్రాంగణంలో శివ తాండవం చేయడం గూస్ బంప్స్ తెప్పించింది. శంకర్‌ మహదేవన్‌, కైలాష్‌ ఖేర్‌ పవర్ ఫుల్ వోకల్స్ పాటకు డివైన్ వైబ్ ని యాడ్ చేశాయి. లిరిసిస్ట్‌ కళ్యాణ్‌ చక్రవర్తి శివుని మహోన్నత శక్తిని పదాల్లో అద్భుతంగా మలిచారు. వినగానే గూస్‌బంప్స్‌ తెప్పించేలా ఈ పాట చాలా కాలం నిలిచిపోతుందని చెప్పొచ్చు.

55
బాలయ్య తొలి పాన్‌ ఇండియా మూవీ `అఖండ 2`

ఈ చిత్రంలో సంయుక్త ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఆది పినిశెట్టి ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సి.రాంప్రసాద్, సంతోష్ D Detakae సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, తమ్మిరాజు ఎడిటర్. ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌. `అఖండ 2: తాండవం` డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీన్ని పాన్‌ ఇండియా మూవీగా రిలీజ్‌ చేస్తున్నారు. బాలయ్య నుంచి వస్తోన్న ప్రాపర్‌ పాన్‌ ఇండియా మూవీ ఇదే కావడం విశేషం. దీంతో ప్రమోషన్స్ పరంగానూ మేకర్స్ గట్టిగానే ప్లాన్‌ చేసినట్టు తాజా ముంబయి ఈవెంట్‌ని బట్టి తెలుస్తోంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories