సూపర్ స్టార్ మహేష్ బాబు గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ సందర్భంగా ఫ్యాన్స్ కి సందేశం ఇచ్చారు. నవంబర్ 15న గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ భారీ ఎత్తున రామోజీ ఫిలిం సిటీలో జరగనుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గ్లోబ్ ట్రాటర్ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. నవంబర్ 15న జరిగే ఈవెంట్ పైనే ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ ఈవెంట్ లో రాజమౌళి మహేష్ అభిమానులకు ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు అని అంతా ఎదురుచూస్తున్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై వరల్డ్ వైడ్ గా అంచనాలు ఏర్పడ్డాయి.
25
వైరల్ అవుతున్న ప్రియాంక చోప్రా లుక్
ఆ అంచనాలకు తగ్గట్లుగానే రాజమౌళి ఈ చిత్రాన్ని 1000 కోట్ల బడ్జెట్ లో రూపొందిస్తున్నారు. గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఆమె ఫస్ట్ లుక్ విపరీతంగా ఆకట్టుకుంది. అదే విధంగా పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు.
35
ఈవెంట్ కోసం పాస్ పోర్ట్ లు
నవంబర్ 15న శనివారం రోజు జరిగే ఈవెంట్ కు రామోజీ ఫిలిం సిటీలో భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈవెంట్ కి అందరూ జాగ్రత్తగా వచ్చి జాగ్రత్తగా వెళ్ళాలి అని రాజమౌళి ఇప్పటికే సందేశం ఇచ్చారు. సాధారణంగా అన్ని ఈవెంట్స్ కి పాస్ లు ఇస్తారు. కానీ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కి పాస్ పోర్ట్ లు ఇస్తున్నారు.
ఈ పాస్ పోర్ట్ ఎల్లో కలర్ లో ఉంటుంది. లోపల మహేష్, రాజమౌళి, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఫోటోలు ఉంటాయి. అదే విధంగా ఈవెంట్ కి ఎలా వెళ్ళాలి అని సూచించే మ్యాప్, క్యూఆర్ కోడ్ ఉంటాయి.
55
ఫ్యాన్స్ కి మహేష్ సందేశం
తాజాగా మహేష్ బాబు గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ నేపథ్యంలో ఫ్యాన్స్ కి సందేశం ఇచ్చారు. వీడియో బైట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మహేష్ బాబు మాట్లాడుతూ ఈవెంట్ రోజున ఆర్ ఎఫ్ సి మెయిన్ గేట్స్ క్లోజ్ చేసి ఉంటాయి. పాస్ పోర్ట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే రండి. లేని వాళ్ళు కంగారుపడి వచ్చేయకండి. ఈ ఈవెంట్ లో చాలా సేఫ్ గా, మెమొరబుల్ గా మార్చండి అని మహేష్ బాబు తెలిపారు.