Akhanda 2 Release పై మరో బ్యాడ్‌ న్యూస్‌ చెప్పిన నిర్మాతలు.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే?

Published : Dec 06, 2025, 07:28 AM IST

బాలకృష్ణ హీరోగా నటించిన `అఖండ 2` సినిమాకి సంబంధించి అభిమానులకు మరో బ్యాడ్‌ న్యూస్‌ చెప్పింది నిర్మాణ సంస్థ. రిలీజ్‌కి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదని వెల్లడించింది. 

PREV
15
వాయిదా పడ్డ `అఖండ 2`

బాలకృష్ణ నటించిన `అఖండ 2 తాండవం` సినిమాకి వరుస అడ్డంకులు ఎదురవుతున్నాయి. సినిమా ఈ శుక్రవారం(డిసెంబర్‌ 5న) విడుదల కావాల్సి ఉంది. కానీ పలు లీగల్‌ కారణాల వల్ల సినిమా ఆగిపోయింది. ఈరోస్‌ సంస్థకి 14 రీల్స్ సంస్థ `వన్‌ నేనొక్కడినే`, `దూకుడు`, `ఆగడు` సినిమాల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సెటిల్‌మెంట్‌ కానందున ఆ సంస్థ 14 రీల్స్ ప్లస్‌పై కోర్ట్ కి వెళ్లింది. దీంతో మద్రాస్‌ కోర్ట్ సినిమా విడుదల ఆపాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్ట్ పరంగా క్లీయరెన్స్ వచ్చిందట. కానీ రిలీజ్‌ విషయంలో అనేక ఇతర అడ్డంకులు ఎదురైనట్టు సమాచారం.

25
బ్యాడ్‌ న్యూస్‌ చెప్పిన నిర్మాణ సంస్థ

దీంతో సినిమా వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని టాక్‌. ఇతర సెటిల్‌మెంట్ల వ్యవహారం ఇప్పుడు సినిమా విడుదలకు దెబ్బగా మారిందని అంటున్నారు. మొత్తంగా బాలకృష్ణ `అఖండ 2` వాయిదా పడాల్సి వచ్చింది. ఈ శనివారం అయినా విడుదలవుతుందని భావించారు. అభిమానులు కూడా ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ మరోసారి నిరాశ తప్పలేదు. తాజాగా మరో బ్యాడ్‌ న్యూస్‌ చెబుతూ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మరోసారి సారీ చెప్పింది. సినిమాని రిలీజ్‌ చేయడానికి ఎంతో ప్రయత్నం చేశామని, కానీ సాధ్యం కాలేదని తెలిపింది.

35
త్వరలో కొత్త తేదీతో వస్తాం

``అఖండ 2` రిలీజ్‌ కోసం మా శాయశక్తులా కృషి చేశాం. ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. కొన్నిసార్లు ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఈ సినిమా విడుదల కోసం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు, సినిమా ప్రేమికులకు మా క్షమాపణలు. ఈ కఠిన పరిస్థితుల్లో మాకు అండగా నిలిచిన నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనులకు ధన్యవాదాలు. `అఖండ 2` ఎప్పుడు విడుదలైన బుల్సేయ్‌ను తాకుతుంది. త్వరలో కొత్త తేదీతో వస్తుంది` అని తెలిపారు. ఇక ఇప్పట్లో సినిమా లేదనే విషయాన్ని చెప్పకనే చెప్పారు.

45
క్రిస్మస్‌ కానుకగా అఖండ 2 ?

ఇదిలా ఉంటే కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. క్రిస్మస్‌ కానుకగా సినిమా రాబోతుందని తెలుస్తోంది. డిసెంబర్‌ 25న విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే మంచి డేట్‌ అని భావిస్తుందట టీమ్‌. డిసెంబర్‌ 24న ప్రీమియర్స్ ప్రదర్శిస్తారని టాక్‌. బాలయ్య ఈ మేరకు ముహూర్తం కూడా పెట్టారని సమాచారం. అయితే ఆ రిలీజ్‌కి సంబంధించిన అడ్జస్ట్ మెంట్‌ జరుగుతుందని అంటున్నారు. ఒకవేళ ఈ డేట్‌కి సాధ్యం కాకపోతే సంక్రాంతి బరిలో దిగితే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే సంక్రాంతికి ఐదు సినిమాలున్నాయి. దీంతో తీవ్ర పోటీ ఉంటుంది. థియేటర్ల కోసం గొడవలు అవుతాయి. అప్పుడు సాధ్యం కాకపోతే రిపబ్లిక్‌ డే స్పెషల్‌ గా రాబోతుందని సమాచారం. ఈ మూడు డేట్స్ లో క్రిస్మస్‌కే ఎక్కువ ఛాన్స్ కనిపిస్తుంది.

55
బాలయ్య కూతురు తేజస్విని సమర్పకురాలిగా `అఖండ 2

ఇక బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన `అఖండ 2` చిత్రంలో సంయుక్త హీరోయిన్‌గా నటించగా, ఆదిపినిశెట్టి విలన్‌గా నటించాడు. పూర్ణ, `భజరంగీ భాయిజాన్‌` ఫేమ్‌ హర్షాలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలయ్య కూతురు తేజస్విని సమర్పకులుగా వ్యవహరించడం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories