Published : Feb 15, 2026, 07:46 PM ISTUpdated : Feb 15, 2026, 07:58 PM IST
తెలుగు స్టార్ హీరోలకు హైదరాబాద్‌లో ఖరీదైన హౌజెస్ ఉన్నాయి. మరి టాప్ లో ఉన్న హీరో ఎవరు? అల్లు అర్జున్, ప్రభాస్, నాగార్జున, చిరంజీవి ఇళ్లు విలువ ఎంత ఉంటుందనేది తెలుసుకుందాం.
టాలీవుడ్‌లో ప్రస్తుతం పాన్ హీరోల ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. అదే సమయంలో భారీ పారితోషికం తీసుకుంటున్న హీరోల ట్రెండ్ కూడా నడుస్తుంది. ఎవరి సినిమా ఎంత కలెక్ట్ చేసిందనేది చర్చనీయాంశంగా మారుతుంది. ఇలాంటి సమయంలో మరో ఆసక్తికర విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అత్యంత ఖరీదైన ఇళ్లు ఉన్న హీరో ఎవరనేది ఆసక్తికరంగా మారింది. మరి కాస్ట్లీ ఇళ్లు ఉన్న హీరో ఎవరనేది టాప్ 5 లిస్ట్ చూస్తే.
26
1.అల్లు అర్జున్ ఇంటి విలువ రూ.100కోట్లు
టాలీవుడ్‌లో అత్యంత ఖరీదైన ఇళ్లు ఉన్న హీరో అల్లు అర్జున్. ఆయనకు జూబ్లీ హిల్స్ లో బ్లెస్సింగ్ పేరుతో లగ్జరీ మాన్షన్ హౌజ్ ఉంది. అత్యాధునిక సధుపాయాలతో, విలాసవంతంగా ఈ ఇళ్లు ఉంటుంది. ఇటీవలే అల్లు అర్జున్ ఈ ఇంటిని దగ్గరుండి కట్టించుకున్నారు. దీని విలువ వందకోట్లు ఉంటుందని అంచనా.
36
2.ప్రభాస్ ఇంటి విలువ రూ.70కోట్లు
ఇక బన్నీ తర్వాత అత్యంత ఖరీదైన ఇళ్లు ఉన్న హీరో ప్రభాస్. ఇండియా బిగ్గెస్ట్ స్టార్‌గా రాణిస్తున్న ప్రభాస్‌కి జూబ్లీ హిల్స్ లో లగ్జరీ హౌజ్ ఉంది. ఆల్ట్రా ప్రీమియమ్ బంగ్లా ఇది. చాలా ప్రైవసీగా, సెక్యూరిటీగా ఉంటుంది. ప్రభాస్ ఇంటి విలువ సుమారు రూ.60-70కోట్ల వరకు ఉంటుందని సమాచారం.
టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. ఆయన పాన్ ఇండియా గేమ్ లో లేరు. బాక్సాఫీసు పోటీలోనూ లేరు. కానీ ఆస్తుల పరంగా తెలుగులోనే రిచ్చెస్ట్ హీరో కావడం విశేషం. నాగార్జున జూబ్లీ హిల్స్ లో ఉంటారు. అత్యాధునిక ఇంటీరియర్ డిజైనింగ్‌తో, లగ్జరీగా ఇంటిని నిర్మించుకున్నారు. ఆయన ఇంటి విలువ రూ.45కోట్లు ఉంటుందని టాక్.
56
4.చిరంజీవి ఇంటి విలువ రూ.35కోట్లు
ఇక టాలీవుడ్ లో మెగాస్టార్‌గా రాణిస్తున్న చిరంజీవి కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. జూబ్లీహిల్స్ లోనే చిరంజీవికి ఇళ్లు ఉంది. రాయల్ లుక్‌ని తలపించేలా, ఇంటీరియర్‌తో చిరంజీవి హౌజ్ ఉంటుంది. దీని విలువ రూ.35కోట్లు ఉంటుందని టాక్.
66
5.మహేష్ బాబు ఇంటి విలువ రూ.30కోట్లు
సూపర్ స్టార్ మహేష్ బాబుకి కూడా జూబ్లీహిల్స్ లోనే ఇళ్లు ఉంది. అత్యధునిక సధుపాయాలతో ఆయన ఇళ్లు ఉంటుంది. అన్ని సౌకర్యాలు అందులో ఉంటాయి. దీని విలువ సుమారు రూ.30కోట్ల వరకు ఉంటుందట. ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత ఖరీదైన ఇళ్లు ఉన్నది ఈ హీరోలే అని, మిగిలిన హీరోల ఇళ్ల విలువ పది, పదిహేను కోట్ల లోపే ఉంటాయని టాక్. ఇది కేవలం సోషల్ మీడియాలో వైరల్ అయ్యే సమాచారం మాత్రమే.