మేకప్‌ లేకపోతే మరింత హాట్‌గా మారిపోయిన ఐశ్వర్యా రాజేష్‌.. ట్రెడిషనల్‌ లుక్‌లో ఎలా ఉందో చూడండి.. రచ్చే

First Published | Jun 23, 2023, 3:49 PM IST

డస్కీ బ్యూటీ ఐశ్వర్యా రాజేష్‌.. కంటెంట్‌ ఓరియెంటెడ్‌ సినిమాలతో మెప్పిస్తుంది. గ్లామర్‌ కి దూరంగా ఉండే ఈ భామ.. ట్రెడిషనల్‌గానే ఎక్కువగా కనిపిస్తుంది. హాట్‌ సైడ్‌లో ఓపెన్‌ అవుతూనే హోమ్లీ బ్యూటీగా మెప్పిస్తుంది. 
 

ఐశ్వర్యా రాజేష్‌ తాజాగా హోమ్లీ బ్యూటీగా మారింది. ట్రెడిషనల్‌ లుక్‌లో కనువిందు చేస్తుంది. ఆధ్యాత్మిక సేవలో నిమగ్నమైన ఈ భామ ఓ డేరింగ్‌ స్టెప్‌ తీసుకుంది. ఆమె మేకప్‌ లేకుండా ఫోటోలను పోస్ట్ చేసింది. ఇన్‌ స్టాగ్రామ్‌ వేదికగా ఆమె తన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. 
 

ఈ సందర్భంగా `ఆనందకరమైన సమయం` అంటూ ఆమె పేర్కొంది. ఇందులో మేకప్‌ లేకుండా ఎంతో క్యూట్ గా ఉంది ఐశ్వర్యా రాజేష్‌. జనరల్‌గా డస్కీ అందాలతో హాట్‌గా కనిపిస్తుంది ఐశ్వర్యా. స్వతహాగా కత్తిలాగా ఉండే ఈ భామ మేకప్‌ లేకపోతే ఇంకేలా ఉంటుందో అనుకోవచ్చు, కానీ ఆమె క్యూట్‌గా మారిపోవడం విశేషం. 
 


ఐశ్వర్యా రాజేష్‌ సినిమాల్లో చాలా వరకు నిండైన దుస్తుల్లోనే కనిపిస్తుంది. గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉంటుంది. కంటెంట్‌ బేస్డ్ చిత్రాలు చేస్తూ మెప్పిస్తుంది. కోలీవుడ్‌లో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తూ మెప్పిస్తుంది. 

ట్రెడిషనల్‌గా కనిపించినా హాట్‌గా ఉండే ఈ భామ అద్భుతమైన నటనతోనే మెప్పిస్తుంది. అందానికి ప్రయారిటీ ఇచ్చే టాలీవుడ్‌లో ఈ బ్యూటీ రాణించలేకపోయింది. ఇక్కడ సక్సెస్‌ కాలేదు. ఆమె నటించిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. దీంతో తెలుగుని గుడ్‌ బై చెప్పి కోలీవుడ్‌ కే పరిమితమయ్యింది. తెలుగులో  చేయకపోవడానికి కారణం.. పెద్ద హీరోలతో సినిమాలు రావడం లేదని, తాను చేస్తే మంచి సినిమా చేయాలనుకుంటున్నట్టు చెప్పింది. 
 

ఐశ్వర్యా రాజేష్‌ కొంత యాటిట్యూడ్‌ చూపిస్తుంటుంది. ఆ మధ్య లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలే వరుసగా చేస్తున్నారనే ప్రశ్నకి హీరోలని ఆ ప్రశ్న అడగ్గలరా అంటూ సెటైర్లు పేల్చింది. మరోవైపు `పుష్ప` సినిమాలో రష్మిక మందన్నా నటించిన `శ్రీవల్లి` పాత్రలో తాను బాగా సూట్‌ అవుతానని, రష్మిక కంటే తనకే బాగా సెట్‌ అవుతుందంటూ కామెంట్‌ చేసింది. దీంతో నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. దీంతో కొన్ని రోజులు ఐశ్వర్యా రాజేష్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. 

ఇటీవల `ఫర్హానా` చిత్రంతో ఆకట్టుకున్న ఐశ్వర్య రాజేష్‌ ఇప్పుడు తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తుంది. తమిళంలో `మోహన్‌దాస్‌`, `తీయవర్‌ కులైగల్ నడుగా`,`ఇదం పోరుల్‌ యీవల్‌` చిత్రాల్లో నటిస్తుంది. మరోవైపు మలయాళంలో మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. 

Latest Videos

click me!