Illu Illalu Pillalu Today Episode Jan 30: విశ్వక్‌కే షాకిచ్చిన అమూల్య, ఇకపై అతడికే భార్య

Published : Jan 30, 2026, 09:55 AM IST

Illu Illalu Pillalu Today Episode Jan 30: ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో అమూల్యను విశ్వక్ కిడ్నాప్ చేయడంతో  ఇంట్లో అమూల్య లేదన్న సంగతి అందరికీ తెలిసిపోతుంది. ఇక అమూల్య గట్టిగానే విశ్వక్ కు షాక్ ఇస్తుంది. ఇక ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి. 

PREV
14
నర్మద, ప్రేమ అనుమానం

ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో అమూల్య ఇంట్లో లేదన్న విషయం తెలుసుకుని ధీరజ్, చందు, సాగర్ ..సేనాపతి ఇంటికి వెళ్లి గొడవ పడతారు. విశ్వక్ ఏదో చేశాడని అనుమానిస్తారు. దానికి భద్రావతి ‘మీ నాన్న ఆనవాయితీగా మొదలుపెట్టిందే కదా. ఇది మీ అందరూ చేసిన వాళ్ళే కదా. కాకపోతే ఇన్నాళ్లు మగింటి వాళ్ళు అయిపోయారు. కానీ ఇప్పుడు ఆడపిల్ల తరుపువారు కాబట్టి ఇప్పుడు మీకు నొప్పి తెలుస్తుంది. బాగా పొగరెత్తి కొట్టుకుంటున్నారు ఇప్పుడు అంతా దిగిపోతుందిలే’ అని లేనిపోని మాటలు అంటుంది భద్రావతి. దీంతో మధ్యలోకి పెద్దమ్మ వస్తుంది. విశ్వక్ ఇంట్లో లేడు ముందు మీ చెల్లి ఎక్కడుందో వెతకండి అని చెబుతుంది. 

దీంతో అన్నదమ్ములంతా సేనాపతి ఇంట్లోంచి వెళ్లిపోతారు. మరొక పక్క రామరాజు ఇంట్లో నర్మద, ప్రేమ కంగారు పడుతూ ఉంటారు. వల్లిని నర్మద ‘నువ్వు అమూల్యను చూడలేదా’ అని అడుగుతుంది. దానికి వల్లి అవన్నీ ఏదేదో చెప్పేస్తుంది. అలాగే రాత్రి ఎవరో ఫీజు తీసేసారు, దానికి దీనికి ఏదో సంబంధం ఉంది అని అంటుంది ప్రేమ.

24
రామరాజు విషయం తెలిసి

ఇక్కడి నుంచి సీన్ అమూల్య దగ్గరికి మారుతుంది. అమూల్య గదిలో కూర్చుని ఒంటరిగా ఏడుస్తూ ఉంటుంది. తన తండ్రిని తలుచుకునే బాధపడుతుంది. ఈ లోపు మల్లెపూలు పట్టుకొని విశ్వక్ గదిలోకి వస్తాడు. ‘ఈ మల్లెపూలు చూడు ఎంత ఫ్రెష్‌గా అందంగా ఉన్నాయో. మనకి ఫస్ట్ నైట్. మరి ఫస్ట్ నైట్ కి పూలు అవసరం కదా. పెళ్లి కాకుండా ఫస్ట్ నైట్ ఏంటని భయపడుతున్నావా’ అని చెప్పి తాళి బయటకు తీస్తాడు. ఇక్కడ నుంచి సీన్ రామరాజు కుటుంబం దగ్గరికి మారుతుంది. పెళ్లి చీర పట్టుకొని సన్నాయి డప్పులతో ఇంటికి వస్తారు. వేదవతి వస్తూనే అమూల్య ఏది అని అడుగుతుంది. కానీ ఎవరు సమాధానం చెప్పకపోవడంతో వేదవతి గట్టిగా అడుగుతుంది.

 ‘పూజ చేసి తెచ్చావు కదా ఈ చీర ఎవరికి’ అని అడుగుతుంది కామాక్షి. దానికి వేదవతి మీ చెల్లెలు కట్టుకోవడానికి అని చెబుతుంది. అప్పుడు కామాక్షి ‘దానికి అమూల్య ఇంట్లో ఉండాలి కదా’ అని అసలు విషయం చెప్పేస్తుంది. దీంతో వేదవతి, రామరాజు షాక్ అవుతారు. ఇల్లంతా వెతికిన అమూల్య కనిపించడం లేదని చెబుతారు. ‘అది నా కూతురు. అది నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. అది ఇంట్లోనే ఉండి ఉంటుంది’ అని రామరాజు నమ్మకంగా చెబుతాడు. రామరాజు వేదవతి కూడా తిరిగి ఇల్లంతా వెతుకుతారు. కానీ కనిపించకపోవడంతో చాలా బాధపడతారు.

34
అసలు ప్లాన్ చెప్పేసిన విశ్వక్

మరో పక్క విశ్వక్ తాళి పట్టుకొని అమూల్య మెడలో కట్టేస్తానని ముందుకు వస్తూ ఉంటాడు. అమూల్య అతడిని తోసేస్తుంది.తన నాన్న పరువు పోతుందని వదిలేయమని కోరుతుంది. విశ్వక్ తాళి అమూల్య ముఖాన కొట్టేస్తాడు. ‘మీ నాన్న గుండె పగిలేలా చేయడం కోసమే నేను తాళి కట్టకుండా వదిలేసాను. ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని షాక్ అవుతున్నావా? అసలు ప్లానింగ్ తెలుసా? మన రెండు కుటుంబాలు కలవడం కోసం నేను నిన్ను ప్రేమించానన్నది పచ్చి అబద్ధం. మీ నాన్న మీద, మీ కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసమే నిన్ను ప్రేమ పేరుతో ట్రాప్ చేశాను అన్నది అసలు నిజం. ఇప్పుడు నేను నీ మెడలో తాళి కడితే మనం ప్రేమించుకుని లేచిపోయి పెళ్లి చేసుకున్నామని అందరూ అనుకుంటారు. నన్ను పెళ్లి చేసుకున్నందుకు మీ నాన్న వాళ్ళు బాధపడినా సరే.. మీ నాన్న పరువు ఎంతో కొంత నిలబడుతుంది. కానీ మీ నాన్న పరువు పోవాలి. అలా కావాలంటే నేను నీ మడలో తాళికట్టకూడదు. ఒకరోజు రాత్రంతా నువ్వు నాతో ఉన్నావని చెబుతాను. ఏకాంతంగా గదిలో కలిసి గడిపామని చెప్తాను. అప్పుడు నీకు పెళ్లి ఆగిపోతుంది. పెళ్లి ఆగిపోవడమే కాదు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారు. పెళ్లి చేసుకోకుండానే నువ్వు తప్పు చేసావని అందరూ నీ గురించి చెడుగా మాట్లాడతారు. అది విని మీ నాన్న కుళ్ళి కుళ్ళి చస్తాడు’ అని అసలు ప్లాన్ చెబుతాడు. దీంతో అమూల్య షాక్ అవుతుంది.

44
విశ్వక్ కు షాకిచ్చిన అమూల్య

ఇక రామరాజు బాధతో కుర్చీలో కూలబడిపోతాడు. ఈలోపే పెళ్లి వాళ్ళు వచ్చేస్తారు. ఏం చేయాలో తెలియక విపరీతంగా టెన్షన్ పడిపోతుంది వేదవతి. ఈలోపు పెళ్లి కారులోంచి వనజ, పెళ్లి కొడుకు, ఆమె భర్త దిగుతారు. ఇదంతా భద్రావతి చూస్తూనే ఉంటుంది. వెంటనే విశ్వక్ కు ఫోన్ చేసి అమూల్యను తీసుకుని రమ్మని చెబుతుంది. భద్రావతి ఒళ్లంతా నగలతో కిందకు వచ్చి విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఈ నగలు ఎలా ఉన్నాయో చూడండి అంటూ సేనాపతిని అడుగుతుంది. ఎందుకు అక్క ఇలా ప్రవర్తిస్తున్నావని అడుగుతాడు సేనాపతి. దానికి భద్రావతి ‘ఆనందం వస్తోంది. అప్పట్లో నా చెల్లి, తర్వాత నా మేనకోడలు వెళ్లిపోయేటప్పుడు ఎంత అవమానపడ్డామో ఇప్పుడు అదే అవమానం ఆ రామరాజు అనుభవిస్తున్నాడు. రా చూద్దాం’ అంటూ సేనాపతిని తీసుకొని బయటికి వెళుతుంది. 

ఈలోపు వనజ మాట్లాడుతూ ‘ముహూర్తానికి టైం అవుతుంది. మా కోడలు ఎక్కడ? అమూల్య ఏది?’ అని అడుగుతుంది. దానికి రామరాజు ఒకసారి లోపలికి రమ్మని పిలుస్తాడు. ఈ లోపు భద్రావతి వచ్చి ‘లోపలికి తీసుకెళ్లి ఏం చెబుతావురా? నా కూతురు లేచిపోయిందమ్మ అని చెవిలో చెబుతావా? అయినా లేచి పోవడం, లేపుకెళ్లిపోవడం నీ కొంపలో ఉన్నవారికి కొత్త కాదు కదా. నీ దగ్గరనుంచి నీ పిల్లలు దాకా అందరికీ వెన్నతో పెట్టిన విద్య కదా. మరి నీ కూతురు లేచిపోయిందని గొప్పగా చెప్పుకోరా’ అంటూ లేనిపోని మాటలు మాట్లాడుతుంది. ఇక్కడితో ఎపిసోడ్ ముగిసిపోతుంది. ఇక ప్రోమో విశ్వక్ కారులో అమూల్య వచ్చి దిగుతుంది. అమూల్య మాట్లాడుతూ మెడలో తాళిని చూపించి మా పెళ్లి అయిపోయిందని చెబుతుంది. దీంతో సేనాపతి, భద్రావతి, విశ్వక్ షాక్ అవుతారు.

Read more Photos on
click me!

Recommended Stories