డస్కీ బ్యూటీ కత్తిలాంటి పోజులు.. నిండైన దుస్తుల్లో ఐశ్వర్యా రాజేష్‌ మెరుపులు.. హాట్‌నెస్‌లో తగ్గేదెలే

First Published Jan 23, 2023, 4:37 PM IST

డస్కీ బ్యూటీ ఐశ్వర్యా రాజేష్‌ ట్రెండ్‌ వేర్‌లో కనిపిస్తే కుర్రాళ్లకి పండగే. అయితే ఆమె ట్రెడిషనల్‌ లుక్‌లోనూ యమ హాట్‌గా ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తాజాగా నిండైన దుస్తుల్లో రచ్చ లేపుతుంది. 
 

కోలీవుడ్‌లో బిజీగా ఉన్న ఈ హాట్‌ అందాల బ్యూటీ ఐశ్వర్యా రాజేష్‌(Aishwarya Rajesh) తాజాగా ట్రెడిషనల్‌ లుక్‌లో మెరిసింది. నిండైన దుస్తులు ధరించి ఫోటోలకు పోజులిచ్చింది. కత్తిలాంటి పోజులిస్తూ కుర్రాళ్ల మతిపోగొడుతుంది. ప్రస్తుతం ఆయా ఫోటోలను ఆమె సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోగా, అవి వైరల్‌ అవుతున్నాయి. 
 

`రన్‌ బేబీ రన్‌` అనే చిత్ర ప్రెస్‌ మీట్‌లో భాగంగా ఈ నయా లుక్‌లో మెరిసింది ఐశ్వర్యా రాజేష్‌. ఇందులో ఆమె చెబుతూ, సహనం ఆనందానికి కీలకమని పేర్కొంది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు నెట్టింట హల్‌ చల్‌ చేస్తున్నాయి. అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. 
 

ఈ సందర్భంగా నెటిజన్లు స్పందిస్తున్నారు. నిండుతనానికి నిదర్శమని, ట్రెడిషనల్‌ బ్యూటీ అని, సింప్లిసిటీకి కేరాఫ్‌ అంటున్నారు. తలైవీ అంటూ రచ్చ చేస్తున్నారు. మొత్తంగా ఐశ్వర్య పిక్స్ ని పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటున్నారు. 
 

ఐశ్వర్యా రాజేష్‌ తెలుగులో సక్సెస్‌ కాలేకపోయింది. ఆమె నటించిన చిత్రాలన్నీ పరాజయాలు చెందాయి. దీంతో తిరిగి కోలీవుడ్‌కే పరిమితమయ్యింది. అక్కడే స్టార్‌ ఇమేజ్‌ సొంతం చేసుకున్న ఐశ్వర్యా రాజేష్‌, ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె చేతిలో పదికిపైగా సినిమాలుండటం విశేషం. 

లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు ఐశ్వర్యా కేరాఫ్‌గా నిలుస్తుంది. బలమైన పాత్రలతో ఆకట్టుకుంటుంది. తనదైన నటనతో పాత్రలకు ప్రాణం పోస్తూ మెప్పిస్తుంది. తల్లిగా, స్ట్రగుల్స్ మహిళా మెప్పిస్తుంది. ఎలాంటి పాత్రలు చేయడానికైనా వెనకాడటం లేదు. పాత్ర డిమాండ్‌ చేస్తే బోల్డ్ గానూ నటించేందుకు సిద్ధంగా ఉండటం విశేషం. 

అందుకే ఈ డస్కీ బ్యూటీకి కోలీవుడ్‌లో ఫుల్‌ డిమాండ్‌. తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. ఇటీవల ఆమె `డ్రైవర్‌ జమున` చిత్రంలో నటించింది. ఈ సినిమాకి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా ఐశ్వర్య నటనకు విశేష ప్రశంసలు దక్కడం విశేషం. ఓ రకంగా ఆమె సినిమాని తన భుజాలపై మోసింది. విజయ తీరానికి చేర్చింది. 

ఐశ్వర్యా రాజేష్‌ హాట్‌నెస్‌కి కేరాఫ్‌. స్వతహాగా హాట్‌ గా ఉండే ఈ బ్యూటీ సినిమాల్లో గ్లామర్‌ షోకి దూరంగా ఉంటుంది. చాలా వరకు పద్ధతిగానే కనిపిస్తుంది. కానీ ఆమెలోని హాట్‌నెస్‌ మాత్రం ఆమెని డామినేట్‌ చేస్తుంది. అందమంటే స్కిన్‌ షో కాదు, నిండైన దుస్తుల్లోనూ ఉంటుందనే విషయాన్ని చాటి చెబుతుంది. అందుకే లక్షల మంది అభిమానగనాన్ని సొంతం చేసుకుంటుంది. 

click me!