గంగూబాయి అవతార్ లో ‘బిగ్ బాస్’ బ్యూటీ.. బ్లాక్ శారీలో మైండ్ బ్లాక్ చేస్తున్న నటి భానుశ్రీ!

First Published | Jan 23, 2023, 4:17 PM IST

‘బిగ్ బాస్’తో మంచి ఫేమ్ దక్కించుకున్న యంగ్ బ్యూటీ  భానుశ్రీ  (Bhanusri) నటిగా అలరిస్తోంది.  మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తూ.. స్టన్నింగ్ ఫొటోషూట్లతో గ్లామర్ విందు చేస్తోంది.
 

హైదరాబాద్ కు చెంది భానుశ్రీ టీవీ మరియు తెలుగు చిత్రాల్లో నటస్తూ వస్తోంది. కొన్నాళ్లపాటు టీవీ రంగంలో మెరిసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం హీరోయిన్ గానూ అవకాశాలను అందుకుంటోంది.
 

మరోవైపు సోషల్ మీడియాలోనూ భానుశ్రీ ఎప్పటికీ యాక్టివ్ గానే ఉంటుంది. తనదైన శైలిలో పోస్టులు పెడుతూ నెటిజన్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అలాగే అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ మతులు పోగొడుతోంది.
 


ఇండస్ట్రీలో హీరోయిన్ గా చలామణీ అవ్వాలంటే..  గ్లామర్ విందు తప్పనిసరి అని తెలుసుకున్న ఈ బ్యూటీ.. స్టన్నింంగ్ అవుట్ ఫిట్లలో మెరుస్తూనే వస్తోంది. ఈ క్రమంలో తాజాగా ‘గంగూబాయి కథియావాడి’ అవతార్ లో ఫొటోషూట్ చేసింది.

బ్లాక్ శారీలో ‘గంగూబాయి’ని అనుకరిస్తూ ఫొటోషూట్ చేసింది. మాస్ లుక్ లోనూ భానుశ్రీ అందం కట్టిపడేస్తోంది. అదిరిపోయే పోజులతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 

ప్రస్తుతం అవకాశాల కోసం చూస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇలాంటి మాస్ రోల్స్ లోనైనా నటించేందుకు ఓకే చెబుతున్నట్టు ఇలా హింట్ ఇస్తోందని అర్థం అవుతోంది. మరోవైపు నెటిజన్లు కూడా ఈ బ్యూటీకి మద్దతుగా నిలుస్తున్నారు. మరిన్ని చిత్రాల్లో కనిపించాలని కోరుకుంటున్నారు. 
 

ఇక కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 2తో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తనదైన ఆటతీరుతో టీవీ ఆడియెన్స్ కు బాగా దగ్గరైది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఆకట్టుకుంది.
 

హౌజ్ నుంచి బయటికి వచ్చాక  భానుశ్రీకి మరింత క్రేజ్ దక్కింది. దాంతో సినిమాల్లోనూ అవకాశాలను అందుకుంటూ వస్తోంది. చివరిగా గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘నల్లమల’ (Nallamala)తో హీరోయిన్ గా అలరించింది.

ఈ చిత్రంలో నటుడు అమిత్ తివారి సరసన భానుశ్రీ ఆడిపాడింది. మూవీలో ‘ఏమున్నవే పిల్లా’ సాంగ్ హిట్ అయ్యింది.  సినిమా కూడా ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. భానుశ్రీ పెర్ఫామెన్స్ కూడా  పర్లేదనిపించింది. ప్రస్తుతం బుల్లితెరపై ‘బీబీ జోడీ’ షోలో సందడి చేస్తోంది. 
 

Latest Videos

click me!