30 ఏళ్ళ క్రితం ఐశ్వర్య రాయ్ సంపాదన ఎంతో తెలుసా..? వైరల్ అవుతున్న ఐష్ ఫ్యాషన్ షో బిల్లు,

Published : May 25, 2022, 12:50 PM IST

ఏళ్లు గడుస్తున్న ఐశ్వర్య రాయ్ అందంలో మాత్రం  పెరుగుతుంది కాని.. తరగడంలేదు. ఐశ్యర్య వయసైపోతుందంటూ.. గుర్తు చేయడానికో ఏమో.. ఆమె కెరీర్ స్టార్టింగ్  లో ఫ్యాషన్ షో కోసం కట్టిన ఫీజ్ రసీదు బయట పడింది.. ప్రస్తుతం వైరల్ అవుతుంది. మరి అప్పట్లో ఐష్ ఎంత ఫీజు కట్టింది..? ఏన్నేళ్లు అవుతుంది.   

PREV
16
30 ఏళ్ళ క్రితం ఐశ్వర్య రాయ్  సంపాదన  ఎంతో తెలుసా..? వైరల్ అవుతున్న ఐష్  ఫ్యాషన్ షో బిల్లు,

ఐశ్వర్య రాయ్... తాజాగా జరిగిన కాన్ ఫెస్టివల్ లో తళుక్కున మెరిసింది. 21 సంవత్సరాలుగా ఐశ్వర్య రాయ్ అంతర్జాతీయ వేదికపై తళుక్కుమంటూనే ఉంది. ఐష్ సొగసు గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకునేదేముంది? కానీ, సొషల్ మీడియాలో ఆమె ప్రస్థానం గురించి మరోసారి చర్చ సాగుతోంది. 

26

అందుకు కారణం కూడా లేకపోలేదు. ఐశ్వర్య వయసు గుర్తు చేస్తూ.. సోషల్ మీడియాలో తెగ హడావిడి జరుగుతుంది. 30 ఏళ్ల కిందట ఫ్యాషన్ షో  నుంచి కంపెనీ నుంచి ఆమె సంపాదించిన డబ్బు, దాని రిసిప్ట్ బయట పడటమే.  దీనికి కారణం. ఇంతకీ ఐశ్వర్య సంపాదంచిన ఫస్ట్ సంపాదన ఎంతో తెలి అంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. 
 

36

1994లో మిస్ వరల్డ్ అయిన ఐశ్వర్య రాయ్.. అంతకంటే ముందే మోడలింగ్ చేసేది. అలా ఐశ్వర్య రాయ్ పాల్గొన్న ఒక మ్యాగజైన్ తాలూకూ ఫోటోషూట్, 1992లో జరిగింది. అంటే, అప్పటికి 18 ఏళ్ల టీనేజ్ లో ఉంది  ఐశ్వర్య. అప్పటికీ ఆమె ఇంకా బ్యూటీ క్వీన్ కాలేదు. 
 

46

బెంగళూరుకు చెందిన ఐశ్వర్య అప్ కమింగ్ మోడల్ అప్పుడప్పుడే ఎంటర్ అవుతున్న రోజులు. ముందుగా కృపా క్రియేషన్స్  అనే సంస్థ కోసం ఆమె కెమెరా ముందుకొచ్చింది. సల్వార్ కమీజ్ ధరించి ఫోజులిచ్చింది. అయితే, ఆ ఫ్యాషన్ క్యాటలాగ్ కోసం ఐశ్వర్య రాయ్ అందుకున్నది ఎంతో తెలుసా...?  అక్షరాలా 15 వందల రూపాయలు...
 

56

ఓ బాలీవుడ్ సొషల్ మీడియా అకౌంట్ ఈ రకంగా పాత బిల్ ను షేర్ చేసింది. దీని ప్రకారం చూస్తే.. ఐశ్వర్య రాయ్ కృపా క్రియేషన్స్ అనే సంస్థకు మోడల్ గా వ్యవహరించటానికి ఒప్పుకున్నట్టు  అగ్రిమెంట్ చూడవచ్చు. అందుకుగానూ 15 వందల రూపాయలు ఆమెకు చెక్కు ద్వారా చెల్లించారు. ఆ విషయం కూడా స్పష్టం చేస్తూ బిల్ పైన సంతకం చేసింది ఐష్

66

 30 ఏళ్ల కింద 15 వందల ఆదాయంతో మొదలు పెట్టిన తన ప్రయాణం విజయవంతంగా ఇంకా కొనసాగిస్తోంది మాజీ విశ్వసుందరి. ప్రస్తుతం బహూ బచ్చన్, పొన్నియన్ సెల్వన్ లాంటి సినిమాతో మన ముందుకు రావడానికి రెడీ అవుతుంది బ్యూటీ. 

click me!

Recommended Stories