చిరంజీవి తో మాజీ మిస్ వరల్డ్ రొమాన్స్.. మెగా 158 మూవీ కోసం ఐశ్వర్య రాయ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? నిజమెంత?

Published : Jan 16, 2026, 02:50 PM IST

ఇంత వరకూ తెలుగులో ఒక్క సినిమాలో కూడా నటించలేదు మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్. చిరంజీవి జోడీగా తీసుకోవాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా వర్కౌట్ అవ్వలేదు. ఇక ఈసారి మెగా మూవీలో ఐశ్ పక్కాగా నటించబోతోందంటున్నారు.. మరి ఆమె రెమ్యునరేషన్ డిమాండ్స్ ఏంటి?

PREV
15
సక్సెస్ జోష్ లో చిరంజీవి టీమ్..

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ జోష్ లో ఉన్నాడు. చాలా కాలంగా వరుస ఫెయిల్యూర్స్ చూసిన మెగాస్టార్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. చిరంజీవి లుక్ ను పూర్తిగా మార్చేసిన అనిల్.. అసలైన మెగా ప్లేవర్ ను అభిమానులకు రుచి చూపించాడు. వెంకటేష్ ఎంట్రీతో ఈసినిమా బ్లాస్టింగ్ సక్సెస్ ను అందుకుంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈసినిమా ఫస్ట్ డే నుంచే బాక్సాఫస్ ను షేక్ చేస్తోంది. ఇక ఈసినిమా తర్వాత ఆయన విశ్వంభరతో అభిమానుల ముందుకు రాబోతున్నాడు.

25
మెగా 158 సినిమాపై భారీ అంచనాలు..

మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ జోష్ లో ఉన్న చిరంజీవి.. నెక్ట్స్ బాబీ డైరెక్షన్ లో మరోసారి సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు. ఈసినిమాను అనౌన్స్ చేశారు కూడా. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా టైమ్ లో చిరంజీవికి వరుస ఫెయిల్యూర్స్ ను ఫేస్ చేశాడు. అదే టైమ్ లో బాబీ వాల్తేరు వీరయ్య సినిమాతో మెగాస్టార్ కు సక్సెస్ ఇచ్చాడు. ఆ నమ్మకంతోనే చిరంజీవి బాబీకి మరో ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఈసారి మెగాస్టార్ ను నెక్ట్స్ లెవల్ లో చూపించబోతున్నాడు బాబీ. ఏం మ్యాజిక్ చేస్తాడా అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలోనే ఈసినిమాలో హీరోయిన్ పై ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

35
గ్యాంగ్ స్టర్ గా మెగాస్టార్

ఈసారి బాబీ మెగాస్టార్ లోని కంప్లీట్ యాక్షన్ న్ ఆడియన్స్ కు రుచిచూపించబోతున్నాడని టాక్. గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవి ఎంత ఎనర్జిటిక్ గా చేశాడో.. అంతే జోష్ ను ఈసినిమాతో చూపించబోతున్నాడట. మెగా 158 లో చిరంజీవి గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించబోతున్నారని, ఇది పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందనుందని టాలీవుడ్ టాక్ అంతేకాదు, ఈ చిత్రంలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా కీలక పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది సమ్మర్ లో స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈలోపు విశ్వంభరను రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.

45
చిరంజీవి జోడీగా ఐశ్వర్య రాయ్

ఇక ఈ సినిమా హీరోయిన్ విషయంలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. టాలీవుడ్ లో ఎప్పటి నుంచో చిరంజీవి జోడీగా ఐశ్వర్య రాయ్ ను తీసుకోవాలని ప్రయత్నాలు జరిగాయి. ఆచార్య కోసం కొరటాల శివ కూడా చాలా ప్రయత్నించాడు. గతంలో కూడా చాలామంది దర్శకులు ఈ ప్రయత్నాలు చేశారు. కానీ ఆమె తెలుగులో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించలేదని సమాచారం. ఇక ఈసారి మెగా జోడీగా విశ్వసుందరి, బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ ను తీసుకోవాలని బాబీ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అంతే కాదు ఐష్ కూడా ఈసినిమాపై సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.

55
ఐశ్వర్య రాయ్ రెమ్యునరేషన్ ఎంత?

ఐశ్వర్య రాయ్ ఈ సినిమా కోసం భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దాదాపు 20 కోట్లకు పైగా రెమ్యునరేషన్, హైదరాబాద్ లో షూటింగ్ సమయంలో ఆమె ఉండే హోటల్ ఖర్చులు, ఆమె సిబ్బందికి సంబంధించిన ఖర్చులు కూడా నిర్మాతలే భరించాలనే షరతు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ అన్ని షరతులకు నిర్మాతలు ఓకే చెబితేనే ఐశ్వర్య రాయ్ ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.ఒకవేళ ఈ చిరంజీవి సినిమా ఆమె ఒప్పుకుంటే, ఇదే ఆమె తొలి పూర్తి స్థాయి తెలుగు సినిమా అవుతుంది. గతంలో ఆమె అక్కినేని నాగార్జునతో కలిసి కేవలం ఒక ఐటెం సాంగ్ లో మాత్రమే కనిపించింది. పూర్తి స్థాయి టాలీవుడ్ సినిమా మాత్రం ఇదే అవుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories