తరుణ్‌ రీఎంట్రీపై గుడ్‌ న్యూస్‌ చెప్పిన రోజా రమణి.. ప్రస్తుతం ఈ లవర్‌ బాయ్‌ చేస్తున్న బిజినెస్ ఏంటో తెలుసా?

Published : May 17, 2024, 08:46 PM ISTUpdated : May 17, 2024, 08:59 PM IST

టాలీవుడ్‌ లవర్‌ బాయ్‌ తరుణ్‌ రీఎంట్రీపై తల్లి రోజా రమణి స్పందించింది. అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. అంతేకాదు ప్రస్తుతం ఆయన ఏం చేస్తున్నాడో కూడా రివీల్‌ చేసింది సీనియర్‌ నటి.   

PREV
17
తరుణ్‌ రీఎంట్రీపై గుడ్‌ న్యూస్‌ చెప్పిన రోజా రమణి.. ప్రస్తుతం ఈ లవర్‌ బాయ్‌ చేస్తున్న బిజినెస్ ఏంటో తెలుసా?

లవర్‌ బాయ్‌ తరుణ్‌ చాలా కాలంగా సినిమాలకు దూరమయ్యాడు. రీఎంట్రీకి సంబంధించిన ఆ మధ్య చాలా వార్తలొచ్చాయి. కానీ అవన్నీ రూమర్లుగానే మిగిలాయి. మరి ఇంతకి తరుణ్‌ రీఎంట్రీ ఉంటుందా? లేదా అనేది పెద్ద సస్పెన్స్. ఈ నేపథ్యంలో తరుణ్‌ తల్లి, అలనాటి నటి రోజా రమణి దీనిపై స్పందించింది. అభిమానులకు గుడ్ న్యూస్‌ చెప్పింది. 
 

27

తరుణ్‌ 2014 వరకు యాక్టీవ్‌గా ఉన్నాడు. చివరగా ఆయన `వేట` చిత్రంలో నటించారు. శ్రీకాంత్‌తో కలిసి ఈ మూవీ చేశాడు. పెద్దగా ఆడలేదు. ఆ సమయంలో చేసిన మరో సినిమా `ఇది నా లవ్ స్టోరీ` 2018లో విడుదలైంది. అది వచ్చిన విషయమే జనానికి గుర్తు లేదు. ఆల్మోస్ట్ పదేళ్లుగా తరుణ్‌ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన రీఎంట్రీ ఎప్పుడు ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఆ మధ్య స్టార్‌ హీరోల సినిమాల్లో కీలక పాత్రలతో రీఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు వచ్చాయి. కానీ అవి నిజం కాదని తరుణ్‌ ఖండిస్తూ వస్తున్నారు. 
 

37

ఈ నేపథ్యంలో తాజాగా తరుణ్‌ అమ్మ, సీనియర్‌ నటి రోజా రమణి స్పందించింది. తరుణ్‌ రీఎంట్రీకి సంబంధించిన గుడ్‌ న్యూస్‌ చెప్పింది. త్వరలోనే తరుణ్‌ మళ్లీ సినిమాల్లోకి రాబోతున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం దానికి సంబంధించిన ప్లాన్స్ జరుగుతున్నాయట. త్వరలోనే ఆ గుడ్‌ న్యూస్‌ రాబోతుందని ఆమె వెల్లడించింది. ఎలాంటి సినిమాతో రావాలి, ఎలాంటి కథలు చేయాలనేది వర్క్ జరుగుతుందని కచ్చితంగా సర్‌ప్రైజింగ్ గా ఉండబోతుందని రోజా రమణి వెల్లడించారు. 
 

47

అయితే సినిమాలు చేయని తరుణ్‌ ఇప్పుడు ఏం చేస్తున్నారనేదానిపై కూడా రోజా రమణి క్లారిటీ ఇచ్చారు. తమకు కొన్ని వ్యాపారాలు ఉన్నాయట. రియల్‌ ఎస్టేట్‌తోపాటు కొన్ని ఫ్యామిలీ బిజినెస్‌లు ఉన్నాయని, ఇన్నాళ్లు అవి చూసుకుంటున్నాడని తెలిపింది. హీరోగా రీఎంట్రీ తప్పుకుండా ఉంటుందని, కాకపోతే ఏది పడితే అది కాకుండా మంచి మూవీతో రావాలని వెయిట్‌ చేస్తున్నట్టు తెలిపింది రోజా రమణి. 
 

57

తరుణ్‌ బాలనటుడిగా కెరీర్‌ని ప్రారంభించారు. 1990లో ఆయన `మనసు మమత`, `బుజ్జిగాడు బాబాయ్`, `అంజలి` చిత్రాలు చేశారు. ఇవి ఒకే ఏడాది విడుదలయ్యాయి. `అంజలి` చిత్రంలో అర్జున్‌ పాత్రకి బాలనటుడిగా జాతీయ అవార్డు వచ్చింది. అలాగే `మనసు మమత`కి నంది అవార్డు వచ్చింది. బాలనటుడిగా `థళపతి`, `సూర్య ఐపీఎస్‌` `అభయం`, `ఆదిత్య 369`, `తేజ`, `మీరా`, `పిల్లలు దిద్దిన కాపురం`, `వజ్రం`, `విజయరామరాజు` చిత్రాల్లో నటించాడు. 
 

67

2000లో `నువ్వే కావాలి` చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి చిత్రంతోనే ఆకట్టుకున్నాడు. లవర్‌ బాయ్‌గా అందరి దృష్టిని ఆకర్షించాడు. `ప్రియమైన నీకు`, `చిరుజల్లు`, `నువ్వు లేక నేను లేను` వంటి లవ్‌ స్టోరీస్‌ చేసి లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. `అదృష్టం`, `నువ్వే నువ్వే`, `నిన్నే ఇష్టపడ్డాను`, `ఎలా చెప్పను`, `నీ మనసు నాకు తెలుసు` చిత్రాలతో లవ్‌ స్టోరీస్‌ కంటిన్యూ చేశాడు. ఆ లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ని కంటిన్యూ చేశాడు. కానీ ఆ తర్వాత నటించిన చిత్రాలన్నీ బోల్తా కొట్టి. దీంతో కొంత యాక్షన్‌ వైపు వెళ్లాడు. వర్కౌట్‌ కాలేదు. వరుసగా ఫ్లాప్‌లు పడటంతో 2014 నుంచి సినిమాలకు దూరమయ్యాడు తరుణ్‌. 
 

77

తరుణ్‌.. హీరోయిన్‌ ఆర్తి అగర్వాల్‌తో ప్రేమలో పడ్డ విషయం తెలిసిందే. `నువ్వు లేక నేను లేను` సినిమా సమయంలో ఈ ఇద్దరి మధ్యప్రేమ ప్రారంభమైంది. ఈ ఇద్దరు ఘాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ అనూహ్యంగా బ్రేకప్‌ చెప్పుకున్నారు. ఆ తర్వాత తరుణ్‌ సినిమాలపై ఫోకస్‌ తగ్గిందని, అదే సమయంలో పరాజయాలు రావడంతో మరింతగా డిస్ట్రర్బ్ అయ్యారని, అది కెరీర్‌ ట్రాక్‌ తప్పేలా చేసిందని వార్తలు వచ్చాయి. ఇందులో నిజమెంతో గానీ అటు ఆర్తి అగర్వాల్‌, ఇటు తరుణ్‌ కెరీర్‌ ఆ తర్వాత డౌన్‌ అయిపోయింది. ఆమె కూడా అనేక ఇబ్బందులు ఫేస్‌ చేసి హార్ట్ ఎటాక్‌తో కన్నుమూసిన విషయం తెలిసిందే. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories