తండ్రి లేడు, పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు సొంత అన్నలని కోల్పోయా.. హీరోయిన్ జీవితంలో భరించలేని విషాదాలు

Published : May 14, 2024, 11:45 AM IST

సౌత్ లో నటిగా ఇంత మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ జీవితం మొత్తం కన్నీటి విషాదాలే ఉన్నాయట. ఇటీవల మదర్స్ డే సందర్భంగా ఐశ్వర్య రాజేష్ తన తల్లి గురించి చెబుతూ కొన్ని విషాదకర సంఘటనలని గుర్తు చేసుకుంది.

PREV
16
తండ్రి లేడు, పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు సొంత అన్నలని కోల్పోయా.. హీరోయిన్ జీవితంలో భరించలేని విషాదాలు
Aishwarya rajesh

విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా దూసుకుపోతోంది ఐశ్వర్య రాజేష్. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాక నటనకు ప్రాధ్యానత ఉన్న అన్ని పాత్రల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ తమిళంలో దాదాపు 8 చిత్రాల్లో నటిస్తోంది.  

26

తెలుగులో ఐశ్వర్య రాజేష్ వరల్డ్ ఫేమస్ లవర్, రిపబ్లిక్ లాంటి చిత్రాల్లో నటించింది. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రంలో రానాకి జోడిగా ముందుగా ఈ యంగ్ బ్యూటీ పేరే వినిపించింది. కానీ ఆ అవకాశం చేజారింది. 

36
Actress Aishwarya Rajesh

సౌత్ లో నటిగా ఇంత మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ జీవితం మొత్తం కన్నీటి విషాదాలే ఉన్నాయట. ఇటీవల మదర్స్ డే సందర్భంగా ఐశ్వర్య రాజేష్ తన తల్లి గురించి చెబుతూ కొన్ని విషాదకర సంఘటనలని గుర్తు చేసుకుంది. తన తల్లి అనుభవించిన కష్టాలని గుర్తు చేసుకుంది. తన తండ్రి అతి మంచి తనం వల్ల కుటుంబం అప్పులపాలైంది. 

46

నాన్న మరణించాక అప్పుల భారం అమ్మ పై పడింది. అమ్మ నన్ను, అన్నలని పోషించడానికి నానా కష్టాలు అనుభవించింది. ఇక అప్పులు ఎలా తీరుస్తుంది. అందుకే ఉన్న ఒక్క ఫ్లాట్ అమ్మేసి అప్పులు తీర్చింది. అన్నలిద్దరూ చదువుకుని ప్రయోజకులు కాబోతున్నారు. అమ్మ అన్నలిద్దరిపై చాలా ఆశలే పెట్టుకుంది. 

56

కానీ అత్యంత దురదృష్ట క్రమంగా ఐశ్వర్య రాజేష్ బ్రదర్స్ ప్రమాదంలో మరణించారు. దీనితో ఫ్యామిలీ దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళింది అని ఐశ్వర్య రాజేష్ ఆ విషాదాన్ని గుర్తు చేసుకుంది. కానీ అమ్మ ఆత్మ స్థైర్యం కోల్పోలేదు. అమ్మే నాకు ఆదర్శం అని ఐశ్వర్య రాజేష్ పేర్కొంది. 

66

జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ముందుకు సాగాలని అమ్మ నుంచి చేర్చుకున్నా. నాన్న లాగా అతి మంచికి పోకూడదని కూడా నిర్ణయించుకున్నా అని ఐశ్వర్య రాజేష్ తెలిపింది. 

click me!

Recommended Stories