ఇక షూటింగ్ పూర్తయ్యాక అనుష్క పేరులో సమస్య వచ్చింది. అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి. స్వీటీ అని టైటిల్ కార్డులో ఎలా వేస్తాం.. ఏదో ముద్దు పేరులాగా ఉంది అని అన్నారట. నాగార్జున స్మృతి అని చెప్పారట. కానీ అది అనుష్కకి నచ్చలేదు. చివరకి అనుష్కనే అనుష్క అనే పేరు ఫిక్స్ చేసింది. కానీ ఆ పేరు కూడా నచ్చలేదట. ఇన్నిసార్లు పేర్లు ఏం మార్చుతాం లే అని దానికే ఫిక్స్ అయింది.