క్రేజీ విలన్ తో లవ్ ఎఫైర్ ? జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అని డిసైడ్ అయిన హీరోయిన్

First Published | Nov 21, 2024, 1:04 PM IST

యంగ్ మలయాళీ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి పేరు చెప్పగానే పొన్నియన్ సెల్వన్ చిత్రం గుర్తుకు వస్తుంది. ఐశ్వర్య లక్ష్మీ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో కీలక పాత్రలో నటించి మెప్పించింది.

యంగ్ మలయాళీ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి పేరు చెప్పగానే పొన్నియన్ సెల్వన్ చిత్రం గుర్తుకు వస్తుంది. ఐశ్వర్య లక్ష్మీ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో కీలక పాత్రలో నటించి మెప్పించింది. పొంగులుళి పాత్రలో ఐశ్వర్య లక్ష్మి నటించిన సంగతి తెలిసిందే. మత్సకార యువతిగా ఆ తరహా గెటప్ లో అలరించింది ఐశ్వర్య లక్ష్మి. అలాగే ఇటీవల ఐశ్వర్య.. దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కొత్త చిత్రంలో కూడా ఐశ్వర్య లక్ష్మి నటించింది. 

ఐశ్వర్య లక్ష్మి తెలుగులో నటించింది తక్కువే. గాడ్సే, అమ్ము లాంటి తెలుగు చిత్రాల్లో మాత్రమే నటించింది. కొన్ని డబ్బింగ్ చిత్రాలు ఆమెని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేసాయి. కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే కాకుండా వైవిధ్యమైన రోల్స్ చేస్తూ ఐశ్వర్య రాణిస్తోంది. ఐశ్వర్య లక్ష్మి 2014లో మోడలింగ్ తో కెరీర్ ప్రారంభించింది. 


Actress Aishwarya Lekshmi

అయితే ఐశ్వర్య లక్ష్మి ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్ ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాను ఇక జీవితంలో పెళ్లి చేసుకోను అంటూ ఐశ్వర్య లక్ష్మీ సంచలన స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమె వయసు ఇప్పుడు 34 ఏళ్ళు. తాను ఎంతో ఆలోచించి పెళ్లి విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐశ్వర్య లక్ష్మి పేర్కొంది. పెళ్లి చేసుకోవాలా వద్దా అని ఎంతో కాలంగా తీవ్రంగా ఆలోచిస్తున్నా. అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని పెళ్లి చేసుకోకూడదు అని నిర్ణయించుకున్నా. 

వాస్తవానికి నాకు పాతికేళ్ల వయసు వరకు పెళ్లి అంటే చాలా ఇష్టం ఉండేది. నేను కూడా పెళ్లి చేసుకోవాలి భర్త కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలి అని కలలు కనేదాన్ని. కానీ ఇటీవల పెళ్ళైన నాకు తెలిసిన జంటలని చాలా మందిని చూశాను. ఒకరు ఇద్దరు తప్ప ఇంకెవ్వరూ సంతోషంగా లేరు. పెళ్లి చేసుకోవడం వల్ల వారు జీవితంలో ఎదగలేకపోతున్నారు. ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే పెళ్లి అడ్డంకి అని అర్థం అయింది అంటూ ఐశ్వర్య లక్ష్మి పేర్కొంది. 

గతంలో ఐశ్వర్య లక్ష్మీ ఒక క్రేజీ విలన్ తో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఆ విలన్ ఎవరో కాదు.. విక్రమ్, ఖైదీ, మాస్టర్ లాంటి చిత్రాల్లో నటించిన అర్జున్ దాస్. అర్జున్ దాస్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజిలో నటిస్తున్నాడు. అప్పుడప్పుడూ హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆ మధ్యన అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మి కలసి ఉన్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తమ మధ్య ఏదో ఉన్నట్లు వస్తున్న వార్తలని వీరిద్దరూ ఖండించారు. 

Latest Videos

click me!