రామ్ చరణ్ దర్గా వివాదం: ఉపాసన ఘాటు స్పందన

First Published | Nov 21, 2024, 12:34 PM IST

మెగా హీరో రామ్ చరణ్ కడప దర్గాను సందర్శించడం వివాదాస్పదమైంది. అయ్యప్ప మాల ధరించి దర్గా సందర్శించడంపై విమర్శలు వచ్చాయి. రామ్ చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియా వేదికగా స్పందించి అన్ని మతాలను గౌరవిస్తామని తెలిపారు.

#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani

మెగా హీరో రామ్ చరణ్ తాజాగా కడప దర్గాను సందర్శించడం వివాదంగా మారిన సంగతి తెలిసిందే.  సోషల్ మీడియాలో రామ్ చరణ్ ను నెటిజన్ లు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం వారు రామ్ చరణ్ ని ఏకిపారేస్తున్నారు. 

రామ్ చరణ్ ఇటీవల కడపకు వెళ్లి అక్కడ దర్గాను సందర్శించి చాదర్ సైతం సమర్పించుకున్నారు. ఇది వివాదస్పదంగా మారడానికి ప్రధాన కారణం రామ్ చరణ్ అయ్యప్ప మాలధారణలో ఉండటమే. ఆయన మూమూలుగా ఉన్నప్పుడు దర్శించుకుంటే ఈ విషయం ఇంత వివాదాస్పదంగా మారేది కాదేమో అని కొందరు అంటున్నారు.   

#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani

  రామ్‌ చరణ్‌పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన సతీమణి ఉపాసన ఘాటుగా స్పందించారు.   ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదిక ఓ పోస్ట్‌ షేర్‌ చేసింది. అయ్యప్ప మాలలో ఉన్న రామ్‌ చరణ్‌ దర్గా ఉత్సవాల్లో పాల్గొన్న ఫోటోను షేర్‌ చేసింది. దీనికి చరణ్‌ అన్ని మతాలను గౌరవిస్తారంటూ సారే జహాసె అచ్చా.. హిందుస్తాన్‌ హమారా అనే గీతాన్ని జోడించింది. అలాగే విశ్వాసం ఉంటే అందరిని ఏకం చేస్తుందని ఆమె హితవు పలికారు.


#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani


“విశ్వాసం అందరిని ఒకటి చేస్తుంది. ఎప్పుడు విభజించబడదు. భారతీయులుగా మేము అన్ని మతాలను గౌరవిస్తాం. ఐక్యతలోనే బలం ఉంది. ఒకేదేశం ఒకేఆత్మ (Faith Unites, Never Divides. As indians We Honor All Paths to the Divine. Our Strength lies in Unity. One nation One Spirit)”అంటూ ఫోటోకి క్యాప్షన్‌ ఇచ్చింది. ఇలా రామ్‌ చరణ్‌పై ట్రోల్‌ చేస్తున్న వారికి ఉపాసన ఇలా తన పోస్ట్‌లో ఘాటుగా రిప్లై ఇచ్చింది. ఆమె పోస్ట్‌కి నెటిజన్ల నుంచి భారీస్థాయిలో మద్దతు వస్తున్నాయి.

Ramcharan, #BuchiBabu, uppena,Shiva Rajkumar

రామ్‌ చరణ్‌ సినిమాల విషయానికి వస్తే...ఆయన హీరోగా డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్‌ ఛేంజర్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా జనవరి 10న విడుదల కానుంది.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత చరణ్‌ నటిస్తున్న చిత్రం ఇది కావడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్‌ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌తో పాటు ప్రమోషనల్‌ కార్యక్రమాలను జరుపుకుటుంది.

Ram Charan


‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రంలో చరణ్‌ డ్యుమెల్‌ రోల్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ పాత్ర ఎన్నికల అధికారిగా కనిపించనుంది. ఇందులో కియార అద్వానీ హీరోయిన్‌ కాగా.. నటి అంజలి మరో ఫీమేల్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తుంది. ఇందులో శ్రీకాంత్‌, సునీల్‌, కన్నడ నటుడు జయరాం, నవీన్‌ చంద్ర, బాలీవుడ్‌ నటుడు హ్యారీ జోష్‌, ఎస్‌జే సూర్య, సముద్రఖని వంటి తదితర నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్‌ సుబ్బరాజు కథను అందించగా.. సాయి మాధవ్‌ బుర్రా డైలాగ్స్‌ రాశారు. ఈ సినిమాకు ఎస్‌ఎస్‌ థమన్‌ సంగీతం అందించారు. ఈ సినిమా తర్వాత రామ్‌ చరణ్‌.. ‘ఉప్పెన’ డైరెక్టర్‌ బుచ్చిబాబు RC16 సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నాడు. ప్రస్తుతం ఈసినిమా కోసం బాలీవుడ్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ శివ ఆధ్వర్యంలో మెకోవర్‌ అవుతున్న సంగతి తెలిసిందే.

Latest Videos

click me!