
థ్రిల్లర్స్ లో మైథలాజికల్ థ్రిల్లర్స్ రూటే వేరు. అయితే అందరికీ ఈ సబ్జెక్ట్ ల మీద గ్రిప్ ఉండదు కాబట్టి పెద్దగా ఇవి రావు. అయితే అప్పట్లో వచ్చి సెన్సేష్ క్రియేట్ చేసిన ‘మర్మదేశం’ ఫేమ్ ఎల్. నాగరాజన్ తెరకెక్కించిన ఈ సీరిస్ ని డైరక్ట్ చేయటంతో క్రేజ్ క్రియేట్ అయ్యింది.
ఈ సీరిస్ లో సాయి ధన్సిక, సంతోష్ ప్రతాప్, వివేక్ రాజగోపాల్, వై.జి. మహేంద్రన్, క్రిషా కురుప్, రాంజీ, దేవదర్శిని, మాథ్యూ వర్గీస్, పొన్వన్నన్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సిరీస్ జీ5 ద్వారా ఆడియెన్స్ ముందుకు అక్టోబర్ 25న వచ్చింది. పురాతన కాలం నాటి మైథాలజికు, ఇప్పటి మోడ్రన్ మిస్టరీస్ కలిపి చేసిన ఈ సీరిస్ ఎలా ఉందో చూద్దాం.
కథేంటి
మామూలుగా నాలుగు వేదాలు చలామణిలో ఉన్నాయి. ఐదవ వేదం గురించి ఈ కథ. ఈ ఐదవ వేదం విషయం ఓ పురాతన తాళపత్ర గ్రంధంలో ఉంటుంది. ఆ వేదం వలన ప్రపంచ మానవాళి భవిష్యత్తు మారిపోతుంది. అను(సాయి ధన్సిక)...స్వేఛ్చా జీవి. తన తల్లి చిన్నప్పుడు స్వేచ్చగా ఉండాలి..మనిష్టం వచ్చినట్లు బ్రతకాలి అనే కాన్సెప్టులో ఉంటుంది. చివరకు తండ్రి మాట కూడా ఆమె పట్టించుకోదు.
ఆమెకు తల్లి చనిపోవటంతో ఆ అస్దికలు తీసుకువచ్చి కాశీలో కలుపుతుంది. ఆ క్రమంలో అక్కడ ఉన్నప్పుడు ఓ సన్యాసి ఆమెకు ఓ పెట్టిను ఇస్తాడు. ఆమె ఐదవ వేదం కుటుంబానికి చెందిన ఆమె అని ...ఆ పెట్టెను తీసుకెళ్లి అయ్యంగారపురమ్ లో పూజారికి అందచేయమని చెప్తాడు. అను మొదట ఒప్పుకోదు. కానీ ఆయన నీ కోసమే ఇంతకాలం ఎదురుచూస్తున్నా...ఈ భూమిమీదకు వచ్చిన భాధ్యత అయ్యిపోయింది అని చెప్తూండగానే అనుకోని విధంగా ప్రమాదం జరిగి ఆమె కళ్ల ఎదురుగానే చనిపోతాడు.
ఆ షాక్ లో ఆ బాక్స్ వదిలేసి కాశీ వదిలేసి వెళ్లిపోదామనకుంటుంది. కానీ ఊహించని విధంగా ఆ భాక్స్ ఆమె దగ్గరకే చేరుతుంది. అయినా సరే తాను అయ్యంగారిపురమ్ వెళ్లాలనుకోదు. పాండిఛ్చేరి వెళ్లాలని డెసిషన్ తీసుకుంటుంది. కానీ ఊంహిచని సమస్యలు వచ్చి ఆమె అయ్యంగారి పురం చేరుకుంటుంది.
అక్కడ ఆమె ఆ భాక్స్ ని అక్కడ పూజారికి ఇస్తానంటే అతను పుచ్చుకోవటానికి భయపడి తీసుకోడు. ఆమె వదిలించుకోవాలనుకుంటుంది. తన పని అయ్యిపోయిందనుకుని ఆ ఊరు వదిలి వెళ్లిపోవాలనుకున్నా సాధ్యం కాదు. అప్పుడు ఏమైంది. అసలు ఆ భాక్స్ లో ఏముంది. అయ్యంగారిపురములో చిక్కుకున్న ఆమెకు జరుగే వింత సంఘటనల వెనక ఉన్న పరమార్ధం ఏమిటి ..చివరకు ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే వెబ్ సీరిస్ చూడాల్సిందే.
ఎలా ఉంది
ఈ సీరిస్ కొన్ని సీక్రెట్స్ ని రివీల్ చేస్తూ ముందుకు సాగుతుంది. ఎపిసోడ్ అయ్యిపోతున్నా సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉండటంతో ఆ విషయం తెలియదు. మర్డర్, మిస్టరీ, థ్రిల్లర్, సోషియో ఫాంటసీ ఇలా అన్నింటిని కలిపి నాగ ఈ ‘ఐందం వేదం’ను తెరకెక్కించారు. మైధాలిజిని మోడ్రన్ డే థ్రిల్లర్ గా మలచటంతో చాలా ఎంగేజింగ్ గా సెట్ అయ్యింది.
డైరగ్టర్ కూడా మైధాలజి ఎలిమెంట్స్ పై పూర్తిగా ఆధారపడకుండా మిస్టరీని మెల్లిమెల్లిగా రివీల్ చేస్తూ మందుకు వెళ్లారు. అయితే కొద్దిగా స్లో పేస్ లో సీరిస్ నడుస్తుంది. డిటేలింగ్ ఎక్కువగా ఉంది. ఫెరఫార్మెన్స్ లు, టెక్నికల్ యాస్పెక్ట్స్ సీరిస్ ని విసుగు లేకుండా ముందుకు తీసుకెళ్లగలిగాయి.
ఈ సీరిస్ కొన్ని చోట్ల పరుగెత్తినా కొన్ని చోట్ల బాగా డ్రాగ్ అయ్యింది. అయితే వాటిని దాటితేనే సీరిస్ ని పూర్తి గా చూడగలుగుతాము. అలాగే మైధాలిజీ ఎలిమెంట్స్ కొన్ని చోట్ల కన్ఫూజన్ కు గురి చేస్తాయి. అలాగే సీన్స్ లో వివరణ కూడా ఎక్కవైంది. ఏవి ఎలా ఉన్నా ఎపిసోడ్స్ ని చివరి దాకా చూడగలుగాము. స్టోరీ ఐడియాలో ఆ సత్తా ఉంది.
హైలెట్స్ :
నటీనటుల స్ట్రాంగ్ ఫెరఫార్మెన్స్ లు
సాయి ధన్సిక అయితే అదరకొట్టింది
సినిమాటోగ్రఫీ సూపర్బ్ గా ఉంది
విజువల్ ఎఫెక్ట్ లు సినిమా స్దాయిలో ఉన్నాయి.
మ్యాజిక్ కూడా కొన్ని చోట్ల మ్యాజిక్ చేసింది
మైనస్ లు
కొన్ని చోట్ల అవసరానికి మించి కథనం స్లో అవటం
కన్ఫూజ్ చేసే మైధలాజికల్ ఎలిమెంట్స్
సీరిస్ ని కూడా సీరియల్ లాగ లాగటం కొన్ని చోట్ల
చూడచ్చా
ఓవరాల్ గా మంచి థ్రిల్లర్ చూసిన ఎక్సపీరియన్స్ ని ఇస్తుంది. ఇంట్రస్టింగ్ ప్రిమైజ్ చివరిదాకా కట్టిపారేస్తుంది. విజవల్స్ కూడా స్టన్నింగ్ చేసే విధంగా ఉంటాయి.
ఎక్కడ చూడచ్చు
'జీ5' లో తెలుగులో ఉంది