లవర్‌ బాయ్ గా స్టార్‌ ఇమేజ్‌ పీక్‌, సడెన్‌గా సినిమాలకు అబ్బాస్‌ గుడ్‌ బై.. తప్పుకోవడానికి కారణం తెలిస్తే షాక్‌

First Published | Oct 25, 2024, 11:56 AM IST

`ప్రేమ దేశం` సినిమాతో యువతని విపరీతంగా ప్రభావితం చేసిన అబ్బాస్‌ సడెన్‌గా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. వేరే దేశం వెళ్లిపోయారు. మరి సడెన్‌గా సినిమాలు మానేయడానికి కారణమేంటో తెలిపారు. 

అబ్బాస్‌.. మూడు దశాబ్దాల క్రితం యువతని ఊపేసిన పేరు. హెయిర్‌ స్టయిల్‌ నుంచి, లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ వరకు ఆయన కుర్రకారుని చాలా ప్రభావితం చేశారు. ఇక అమ్మాయిలైతే అబ్బాస్‌ అంటే పడిచచ్చే వాళ్లు. ఆ ఫాలోయింగ్‌ వేరేలెవల్‌. హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమా `ప్రేమ దేశం`తోనే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టి స్టార్‌ ఇమేజ్‌, లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ సొంతం చేసుకున్నారు. ఇప్పటికీ అబ్బాస్‌ అంటే `ప్రేమ దేశం` సినిమానే గుర్తొస్తుంది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

అంతగా ప్రభావితం చేసిన అబ్బాస్‌ కొన్నాళ్ల తర్వాత సడెన్‌గా సినిమాలు మానేశారు. ఆయన ఇండస్ట్రీకే దూరమయ్యారు. దేశం వదిలి వెళ్లిపోయారు. వేరే కంట్రీలో సెటిల్‌ అయ్యారు. అంతేకాదు స్టార్‌ హీరో స్టేటస్‌ని అనుభవిస్తున్న సమయంలోనే సినిమాలు వదిలేసిన ఆయన మెకానిక్‌గా, పెట్రోల్‌ బంక్‌లో వర్కర్‌గా పనిచేశారు. వివిధ ఇతర రంగాల్లోకి వెళ్లారు. మరి అలా వెళ్లడానికి కారణమేంటి? అబ్బాస్‌ సినిమాలు ఎందుకు మానేశారు? ఆయన జీవితంలో అసలు ఏం జరిగిందనేది చూస్తే, 
 


వెస్ట్ బెంగాల్‌కి చెందిన అబ్బాస్‌.. ఫైలట్‌ అవ్వాలనుకున్నారు. కానీ మ్యాథ్స్ లో వీక్‌ కావడంతో మోడలింగ్‌ రంగంలోకి వచ్చారు. అట్నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టాడు. కోలీవుడ్‌ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆయన నటించిన తొలి చిత్రం `ప్రేమదేశం`. అబ్బాస్‌తోపాటు వినీత్‌ మరో హీరోగా నటించారు. టబు హీరోయిన్‌. ఈ ముగ్గురు కాలేజ్‌ ఫ్రెండ్స్. వినీత్‌, అబ్బాస్‌ ఒకే అమ్మాయి టబుని ప్రేమిస్తారు.

ఆ ప్రేమ కోసం కొట్టుకుంటారు. చివరికి ఆమెని ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. కథగా ఇది సింపుల్‌గా ఉన్నా, సినిమా చూస్తే పిచ్చెక్కిపోతుంది. ఆ లవ్‌ స్టోరీ 1996లో కుర్రకారుని ఊపేసింది. కాలేజ్‌ యువతని బాగా డిస్టర్బ్ చేసింది. ఈ సినిమా చూసి ఎంతో మంది కుర్రాళ్ల కాలేజ్‌ మానేసి అమ్మాయిల వెంటపడటం, ప్రేమలో పడటం చేశారంటే ఆ సినిమా ప్రభావం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

ఇందులో అబ్బాస్‌ పాత్ర మరింత హైలైట్‌ అయ్యింది. ఆయన హెయిర్‌ స్టయిల్‌ పాపులర్‌ అయ్యింది.ఈ సినిమాతో ఆయనకు ఓవర్‌ నైట్‌లో స్టార్‌ ఇమేజ్‌ వచ్చింది. వరుసగా హీరోగా అనేక సినిమాలు వచ్చాయి. తమిళంలో చాలా సినిమాలు చేసినా, తెలుగులో మాత్రం అడపాదడపానే చేశారు. ఇతర హీరోల సినిమాల్లో స్పెషల్‌ రోల్స్, కీ రోల్స్ చేస్తూ ఆకట్టుకున్నారు.

`రాజా`లో వెంకటేష్‌, సౌందర్యలతో కలిసి నటించారు. ఇలా కెరీర్‌ పీక్‌లో ఉన్న సమయంలోనే ఆయన సినిమాలు మానేశారు. మరి ఆ స్టేజ్‌లో ఏ స్టార్‌ హీరో అలా చేయరు. కానీ అబ్బాస్‌ అలా ఎందుకు చేశాడనేది పెద్ద మిస్టరీ. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చారు అబ్బాస్‌. 
 

తాను ఎందుకు సినిమాలు వదిలేయాల్సి వచ్చిందో వెల్లడించారు. తనకు సినిమాల్లో పీక్‌ స్టేజ్‌ చూశాక బోర్ కొట్టిందట. మోనోటనీగా అనిపించిందట. తనకు సినిమాల్లో ఏదో అసంతృప్తిగా అనిపించిందట. ఇంకా ఏదో చేయాలనిపించిందట. అందుకే సినిమాలు మానేశాడట. సినిమాలు మానేసి పెళ్లి చేసుకుని న్యూజిలాండ్‌ వెళ్లిపోయారు. అక్కడ ఫ్యామిలీతో సెటిల్‌ అయ్యాడు.

అక్కడ కొన్ని రోజులు మెకానిక్‌గా పనిచేశారు. తాను ఉండే ప్రాంతంలో మెకానిక్స్ ఎవరూ ఉండరు. తన వెహికల్స్ కి రిపేర్‌ వస్తే ఎలా అని చెప్పి, మెకానిక్‌ వర్క్ నేర్చుకున్నాడట. దాని వల్ల చాలా మందికి హెల్ప్ చేశాడట. ఆ తర్వాత ఓ పది రోజు పెట్రోల్‌ బంక్‌లో పనిచేశాడట. ఆ జాబ్‌ కూడా బోర్ కొట్టింది. ఇందులో ఎదగలేమని తెలుసుకుని కంస్ట్రక్షన్‌ రంగంలోకి అడుగుపెట్టాడు.

ఏడాది పాటు అది చేశాడు. ఆ తర్వాత రియల్‌ ఎస్టేట్‌ చేశాడు. ఇప్పుడు తన భార్య, కూతురు రియల్‌ ఎస్టేట్‌ చేస్తున్నారని, కొడుకు ఐటీ జాబ్‌ చేస్తున్నాడని తెలిపారు అబ్బాస్‌. ఆయన ఏడాది క్రితమే ఇండియాకి వచ్చారు. చెన్నైలో ఉంటున్నారు. మళ్లీ సినిమాల్లో నటించాలని ఉందని `ఇండియాగ్లిట్జ్` యూట్యూబ్‌ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు అబ్బాస్‌. మరి ఆయన రీఎంట్రీ ఎప్పుడు ఉంటుందో చూడాలి. 
 

తమిళంలో తెరకెక్కిన `ప్రేమదేశం` సినిమాని తెలుగులో డబ్‌ చేసి విడుదల చేశారు. ఈ సినిమాతోనే మన ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత ఆయన `ప్రియా ఓ ప్రియా` సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. `రాజహంస`, `రాజా`, `అల్లుడుగారు వచ్చారు`, `అనగనగ ఒక అమ్మాయి`, `క్రిష్ణబాబు`, `మాధురి`, `నీ ప్రేమకై`, `స్వేతనాగు`, `పొలిటికల్‌ రౌడీ`, `చంద్రహాస్‌`, `అనసూయ`, `ఇది సంగతి`, `బ్యాంక్‌`, `రామ్ దేవ్‌`, `అలా జరిగింది ఒక రోజు` వంటి తెలుగు సినిమాల్లో నటించారు. 

read more: `పొట్టేల్‌` సినిమా రివ్యూ, రేటింగ్‌

Latest Videos

click me!