హాఫ్ న్యూడ్ గా రీతూ వర్మ ? ఆమె బట్టలపై అనంత్ శ్రీరామ్ కామెంట్స్.. ఇంత రచ్చ ఎందుకంటే..

First Published | Oct 25, 2024, 10:53 AM IST

టాలీవుడ్ లో ప్రముఖ లిరిసిస్ట్ లలో అనంత్ శ్రీరామ్ ఒకరు. అనంత్ శ్రీరామ్ ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు. ఇప్పటికీ సూపర్ హిట్ సాంగ్ అందిస్తున్నారు. ఇటీవల లిరిసిస్ట్ లపై కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.

టాలీవుడ్ లో ప్రముఖ లిరిసిస్ట్ లలో అనంత్ శ్రీరామ్ ఒకరు. అనంత్ శ్రీరామ్ ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు. ఇప్పటికీ సూపర్ హిట్ సాంగ్ అందిస్తున్నారు. ఇటీవల లిరిసిస్ట్ లపై కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. సాంగ్ బాగాలేకపోతే మొదట మ్యూజిక్ డైరెక్టర్ ని ఆ తర్వాత లిరిసిస్ట్ ని ట్రోలింగ్ తో ఆడేసుకుంటున్నాడు. 

అనంత్ శ్రీరామ్ కి కూడా ట్రోలింగ్ తప్పలేదు. రీసెంట్ ఇంటర్వ్యూలో అనంత్ శ్రీరామ్ తన పై జరిగిన ట్రోలింగ్  గురించి మాట్లాడారు. వరుడు కావలెను చిత్రం కోసం తాను రాసిన దిగు దిగు దిగు నాగ అనే సాంగ్ పై విపరీతంగా ట్రోలింగ్ జరిగింది అని అన్నారు. నా పై జరిగిన ట్రోలింగ్ లో అసలు అర్థమే లేదు. ఆ పాటలో వాడిన పదజాలం బాగాలేదు అని విమర్శలు వచ్చినట్లు యాంకర్ ప్రశ్నించారు. ఆ పదాలతో మీకు సమస్య ఏంటి అని అడిగారు. 


అనంత్ శ్రీరామ్ వివరణ ఇస్తూ.. ఆ పాటని చాలా మంది ఐటెం సాంగ్ అన్నట్లుగా మాట్లాడారు. హీరోయిన్ హీరోని ఊహించుకుంటూ పాడే పాట ఐటెం సాంగ్ ఎలా అవుతుంది. ఐటెం సాంగ్ అంటే హీరోయిన్ కాకుండా మరో అమ్మాయి చేయాలి. కానీ అక్కడ డ్యాన్స్ చేసింది హీరోయిన్ రీతూ వర్మ. అది ఒక కాలేజ్ ఈవెంట్ నేపథ్యంలో వచ్చే పాట. 

Anantha Sriram

కరోనా ప్రభావం తగ్గిపోయిన తర్వాత ఎలాంటి న్యూస్ లేకపోవడంతో ఈ పాటపై పడ్డారు అని అనంత్ శ్రీరామ్ కౌంటర్ ఇచ్చారు. పైగా అది హాఫ్ న్యూడ్ సాంగ్ అని ట్రోల్ చేశారు. అందులో హాఫ్ న్యూడ్ ఏముంది ? రీతూ వర్మ కింది వరకు పరికిణి వేసుకుంటుంది.. నిండుగా రవిక కూడా వేసుకుంటుంది. అక్కడ ఆఫ్ న్యూడ్ అన్నట్లుగా ఏమి లేదే అని అన్నారు. 

మనోభావాలు దెబ్బతిన్నాయి అని సులభంగా అనేస్తారు. నిజమైన గాయం అయితే పైకి కనిపిస్తుంది. మనోభావాలు దెబ్బతినడం అంటే పైకి కనిపించవు. కాబట్టి అనేయడం సులభం అని అనంత్ శ్రీరామ్ కౌంటర్ ఇచ్చారు. 

Latest Videos

click me!